Home / 18+ / ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించేది ఎవరో తెలుసా?

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించేది ఎవరో తెలుసా?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్‌ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. గత వారం రోజులుగా ఆదాయపన్ను శాఖ సోదాల్లో సేకరించిన కీలక ఆధారాలను బట్టి సీఎం రమేశ్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుమారు రూ.800 కోట్లను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్ల మళ్లింపుపై పూర్తి ఆధారాలు లభించగా మరో రూ.700 కోట్ల మేరకు అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు.

సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్‌ఎనర్జీ, కదిరి గ్రీన్‌పవర్, రిత్విక్‌ గ్రీన్‌పవర్‌ల నుంచి ప్రవాహంలా నిధులను ఈ సంప్రదాయ ఇంధన తయారీ కంపెనీలోకి తరలించినట్లు భావిస్తున్నారు.గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఎక్కడా ఈ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది.సరైన బిల్లులు లేకుండా రూ.కోట్లలో చెల్లింపులు జరుగుతున్నాయి అని పెరుకున్నారు.ఢిల్లీకి చెందిన సబ్‌కాంట్రాక్టర్‌ ఎన్‌కేజీ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు లేవు.

ఇది ఇలా ఉంటే సీఎం రమేష్‌ ఇంట్లో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు! కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలోనూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ పాత్ర ఉన్నట్లు ఐటీ సోదాలతో వెలుగులోకి వస్తోంది. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముట్టజెప్పిన సొమ్ములో కొంత డబ్బును సీఎం రమేష్‌ కంపెనీల ద్వారా చేరవేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ మొత్తానికి రమేష్ ముఖ్య వ్యక్తిగా పరిగణించారు.

అయితే సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ తదితర కంపెనీల నుంచి అడ్రస్‌లేని బోగస్‌ కంపెనీలకు రూ.వందల కోట్లలో డబ్బులు తరలించినట్లు తాజాగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బును ఫిరాయింపు వ్యవహారాలకు వినియోగించినట్లు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు కూడా ఇలాగే డబ్బు అందిందనే ప్రచారం జరుగుతోంది. కిడారి పార్టీ మారిన సమయంలో విశాఖపట్నానికి చెందిన ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుయాయుడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.7 కోట్లు జమ అయినట్లు సమాచారం. విశాఖ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే ఆయన అనుయాయుడి ఇల్లు ఉంటుంది.చంద్రబాబును మెప్పించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిన నాయకులు తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్నట్లు టీడీపీలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సొమ్ములు ఎవరి ద్వారా వెళ్లాయనే విషయాన్ని ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచగలిగారని, కానీ సీఎం రమేష్‌ ఆస్తులపై జరిగిన ఐటీ సోదాలతో స్పష్టత వచ్చినట్లు అధికారపార్టీకి చెందిన నాయకులే పేర్కొంటున్నారు

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat