Home / SLIDER / మహకూటమిలో ప్రకంపనలు..!

మహకూటమిలో ప్రకంపనలు..!

టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి ల‌క్ష్యంగా కాంగ్ర‌స్ సార‌థ్యంలో ఏర్పాటైన మ‌హాకూట‌మి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు కూట‌మికి గుడ్‌బై చెప్ప‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించింద‌ని అయినా, తమ‌కు నిరాద‌ర‌ణే ఎదుర‌వుతోంద‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్‌తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు చేసి, కూటమి ఏర్పాటు సమయంలో అందరికి గౌరవప్రదమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నామని కూటమి ఏర్పడి 50 రోజులు గడుస్తునా ..ఎజెండా ఖరారు అయినా అడుగు ముందుకు పడటం లేదని చాడ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం పట్ల సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంద‌ని ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ భ‌గ్గుమ‌న్నారు. సీట్ల కేటాయింపుల్లో లీకులు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో గందరగోళానికి దారితీస్తోంద‌ని మండిప‌డ్డారు.

సీపీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసంబద్ధమైన లీకేజీల కాంగ్రెస్ పార్టీ ఇస్తోందని వాపోయారు. లీకేజీలపై ఇప్పటికే కోదండరాం, రమణతో చర్చించామన్నారు. సీపీఐ కార్యకర్తల్లో నిరాశ కల్గించే విదంగా లీకేజీల ఉంటున్నాయని, ఈ నెల 4వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం పెడుతామని అన్నారు. కాగా, ఈ స‌మావేశాల్లో సీపీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకునే
అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat