Home / Uncategorized / తెలుగు సంస్థ చేతికి చమురు బావులు
megha engineering

తెలుగు సంస్థ చేతికి చమురు బావులు

గుజరాత్‌లోని కాంబెల్‌, అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌ను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకుంచుకున్న ఎంఈఐఎల్‌ దేశ, విదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ రంగంలో తాజాగా రెండు చమురు క్షేత్రాలను దక్కించుకుంది. గుజరాత్‌లోని కాంబెల్‌, అస్సాంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌లో చమురు, సహజ వాయువును వెలికితీసే పనులను దక్కించుకున్న ఎంఈఐఎల్‌ 2020 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే విధంగా పనులను కొనసాగిస్తున్నది. దేశీయంగా ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించానే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అములోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా చేపట్టిన చమురు, సహజవాయు క్షేత్రాల వెలికితీత పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ విభాగంలో ఇప్పటికే దేశ, విదేశాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టి, విజయవంతంగా పూర్తిచేసింది. భారతదేశంలో అసోం, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, త్రిపుర, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా కువైట్‌, జోర్డాన్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌ తదితర దేశాలలో రిఫైనరీ తదితర పనులను కొనసాగిస్తున్నది.

తాజాగా కాంబెల్‌, లక్ష్మీజెన్‌ చమురు క్షేత్రాలను దక్కించుకొని చమురు, సహజవాయు వెలికితీత రంగంలోకి ఎంఈఐఎల్‌ అడుగుపెట్టింది. కాంబెల్‌ క్షేత్రంలో దశలవారీగా మూడు బావులను తవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసోం ప్రభుత్వం నుంచి లక్ష్మీజెన్‌ చమురు క్షేత్రంలో తవ్వకాలకు సంబంధించిన అనుమతులను మేఘా ఇంజనీరింగ్‌ సాధించింది. పశ్చిమ తీరాన గుజరాత్‌ రాష్ట్రం పఠాన్‌ జిల్లాలోని కాంబెల్‌ ఆయిల్‌ ఫీల్డ్‌తో పాటు ఈశాన్య ప్రాంతంలోని అర్కన్‌ బేసిన్‌లోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్‌ను మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకున్నట్టు ఎంఈఐఎల్‌ హైడ్రోకార్బన్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రాజేశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించామని, 2018లో చమురు బావులను డ్రిల్‌ చేయడం ద్వారా 2020లో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, రానున్న రెండు మూడేళ్లలో వంద మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పైగా పెట్టుబడిని ఎంఈఐఎల్‌ సొంతంగానే పెడుతోందని పి.రాజేశ్‌రెడ్డి వివరించారు. ఈ రెండు ఆయిల్‌ ఫీల్డ్స్‌లోనూ ప్రధానంగా బావులను తవ్వడంతో పాటు ఆయిల్‌, గ్యాస్‌ను వెలికితీయనున్నారు. చమురు, సహజవాయువును శుద్ధిచేసేందుకు గానూ ట్రీట్‌మెంట్‌, ఎఫ్లియెంట్‌ ప్లాంట్లను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేస్తుంది.

ఓఎన్‌జీసీలోని నార్త్‌ సాంతల్‌ సెంట్రల్‌ ట్యాంక్‌ ఫారమ్‌ (సీటీఎఫ్‌)కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంబెల్‌ ఇంధన క్షేత్రం నుంచి జీవితకాలం ఇంధనం లభిస్తుందని అంచనా వేసినట్టు పి.రాజేశ్‌రెడ్డి చెప్పారు. ఈ క్షేత్రం నుంచి ప్రతీ రోజూ లక్షాముప్పైవేల ఘనపు మీటర్ల గ్యాస్‌ను, 3.70 లక్షల బ్యారల్స్‌ (బిబిఎల్‌ఎస్‌) ముడిచమురును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఎంఈఐఎల్‌ నిర్ణయించుకుంది. వెలికితీసి, శుద్ధిచేసిన ఇంధనాన్ని ఐవోసీఎల్‌, బీపీసీల్, గెయిల్‌, జీఎస్‌పీఎల్‌తోపాటు ఎస్‌ఆర్‌, సీజీడీ కంపెనీలకు మేఘా ఇంజనీరింగ్‌ విక్రయించనుంది. డీజీహెచ్‌ (డైరెక్టర్‌ జనరల్‌ హైడ్రోకార్బన్స్‌) అంచనా ప్రకారం కాంబే బేసిన్‌ (గుజరాత్‌)లోని కాంబెల్‌ ఆయిల్‌ ఫీల్డ్‌తోపాటు అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్‌లో వాణిజ్యపరమైన చమురు, గ్యాస్‌ ఉత్పత్తిచేయడానికి సమృద్ధిగా వనరులు ఉన్నాయి. జాతీయస్థాయిలో చమురు ఇంధన వనరులను వెలికితీసేందుకు కేంద్రప్రభుత్వం రూపొందించిన నూతన విధానం (లైసెన్సింగ్‌ విధానం) ప్రకారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చమురు క్షేత్రాలకు ప్రైవేటు సంస్థలను ఎంపికచేసింది. ఆ విధంగా మేఘా రెండు క్షేత్రాలను దక్కించుకుంది.

మేఘా ఇంజనీరింగ్‌ పూర్తిస్థాయిలో సొంతనిధులు, ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో స్వయంగా వీటిలో పనులను ప్రారంభిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్‌ గ్యారెంటీలు సమకూర్చటం, ఒప్పందం చేసుకోవడం తదితర పరిపాలనాపరమైన పనులను పూర్తిచేసింది. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ విభాగం ఇంధన రంగంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలైన ముడి ఇంధన ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, కంప్రెషర్‌ ప్లాంట్లు, గ్యాస్‌ ఆధారిత క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్స్‌ లాంటి అనేక పనులను సకాలంలో పూర్తి చేస్తోంది. ఎంఈఐఎల్‌ హైడ్రోకార్బన్స్‌ నిపుణుల బృందం ఫ్యాబ్రికేషన్స్‌, నాణ్యత ప్రమాణాలతో అనుకున్న సమయం కంటే ముందుగానే అంటే రికార్డ్‌ సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తోంది. దేశీయంగా గృహ అవసరాల నిమిత్తం ఇంటింటికీ వంటగ్యాస్‌ను అందించే సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) ప్రాజెక్టులను కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అప్పటికే తొలిసారిగా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కార్ణాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాలో ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాలో 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్‌ అందించేందుకు 3100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులను మేఘా ఇంజనీరింగ్‌ ఇటీవలనే దక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్‌ హైడ్రోకార్బన్స్‌ డివిజన్‌ దేశవ్యాప్తంగా సహజవాయువు పైపులైన్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్‌ (మేఘా గ్యాస్‌) సరఫరా చేయటం ద్వారా జీవన ప్రమాణాలను, సమాజంలో ఇన్‌ఫ్రా ఫలాలు నేరుగా అందించేందుకు ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. రవాణా అవసరాలు తీర్చే విధంగా కూడా మౌలిక వసతులను ఇప్పటికే ఏర్పాటు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat