Home / 18+ / ధక్షిణాఫ్రికాలో ” టీఆర్ఎస్ మిషన్ ” ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం 

ధక్షిణాఫ్రికాలో ” టీఆర్ఎస్ మిషన్ ” ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం 

తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యం లో  వినూత్న ప్రాచార కార్యక్రమం  ” టీఆర్ఎస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి ఈరోజు ధక్షిణాఫ్రికా లో ఎన్నారై టీఆర్ఎస్ ధక్షిణాఫ్రికా ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఎన్నారై టీఆర్‌ఎస్ -ధక్షిణాఫ్రికా  అధ్యక్షులు గుర్రాల నాగరాజు, ఉపాధ్యక్షులు మల్లిక్ అర్జున్ రెడ్డి, కార్యదర్శి/కోశాధికారి హరీశ్ రంగా, మీడియా ఇన్ఛార్జ్ బెల్లి కిరణ్ కుమార్, ఉమ్మడి కార్యదర్శి వెంకట రమనా రెడ్డి కంకనాల, కార్యనిర్వాహక సభ్యులు చక్రపాని ధర్శనం, సాఇ కిరన్ నల్లా, సౌజన్ రావు నెలగిరి, అనీల్ రెడ్డి, ఐటి కార్యదర్శి విష్ను జయ్ గూండా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాంబాబు తొడుపునూరి, వెల్ఫేర్ ఇన్ఛార్ రాజశేకర్ అనుమల్ల, మెంబర్శిప్ ఇన్ఛార్జ్ నామ రాజేశ్ మరియు విజయ్ జుంజురు, చారిటీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి అగ్గనగారి మరియు అరవింద్ ప్రసాద్ చీకొటి, ఇవెంట్స్ ఇన్ఛార్జ్ కుశల్ దేసాఇ మరియు నరేష్ యడారి, వెల్ఫేర్ ఇన్ఛార్జ్ సుకేశ్ అలుగూరి మరియు శివారెడ్డి, కల్చరల్ ఇన్ఛార్జ్ నవదీప్ రెడ్డి, కోర్ కమిటి మెంబర్స్ ఫనిధర్ పడకంటి, శ్రీనివాస్ రేపల మరియు దీపిక జొన్నలగడ్డ, టీఆర్‌ఎస్ అభిమానులు చంధు రంగా, మధు రంగా, అనిల్ పాపినేని, ఇర్ఫాన్, రాజేశ్ మరియు సుధీర్ భీమిరెడ్డి తధితరులు పాల్గొన్నారు

         

ధక్షిణాఫ్రికా  అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారి నాయకత్వంలో టీఆర్‌ఎస్-ధక్షిణాఫ్రికా టీమ్ ఈ వార్ రూమ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేశ్ బిగాల స్కైప్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యాలయం ద్వారా ఆసరా పించన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాల్ క్యాంపేయిన్ వాలంటీర్లు తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా వివరించనున్నారు.

                                                                                                      

రాబోయే రోజుల్లో  ప్రతీ కార్యకర్త తమ తమ శక్తి మేరకు ప్రచారం చేసి గత నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి  టీ.ఆర్.యస్ పార్టీ ని అధికారంలో తీసుకొచ్చే విధంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు.

జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వీరంతా పనిచేయనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat