Home / 18+ / కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?

కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?

అనుమోలు రేవంత్ రెడ్డి.. పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్..? కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా.? రేవంత్ ని అంతలా బలహీన పరచిన అంశాలేమిటి.? ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయ‌కులు తెలుసుకునేందుకు ఈ అంశాలపై సర్వేతో సహా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి.? ఇక్కడ ఏమైనా చేస్తే గెలవగలమా.? వంటి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు తెప్పించుకున్నట్టు తెలిసింది. ముందుగా అధికారపార్టీ ఆపరేషన్ చూస్తే కొడంగ‌ల్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు సాధ్యాసాద్యాల‌పై అధ్యయ‌నం చేసే బాద్య‌త‌ల‌ను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండే కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఆయాపార్టీల విధానాలతో విసుగుచెంది కారెక్కారు. ఈ పరిణామంతోనే రేవంత్ రెడ్డి సగం పనైపోయింది.

 

ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రోజుకే రేవంత్ఎన్నికలంటూ వస్తే ఓటమి ఖాయమని భావించారు. చంద్రబాబు చేయించిన సర్వేలోనూ రేవంత్ కు మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తోంది. ఎంతలా ప్రయత్నించినా రేవంత్ రెడ్డిని బలపరచలేకపోవడం పై మహాకూటమిలో చాలాకాలం మేథోమథనమే జరిగిందట.. దీంతో దూకుడుగా రేవంత్ ను కేసీఆర్ మీదకు మాటల యుద్ధం ద్వారా వదిలితే భారీ ఇమేజ్ వస్తుందని ఆశించినా.. అది ఏ మాత్రం ఫలితాలు ఇవ్వదన్న విషయం త్వరలోనూ స్పష్టమైందట. ఇక మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ప్రచారంలో దిగడం, కేటీఆర్, హరీష్ రావులు పాగావేయడంతో సీన్ పూర్తిగా మారిపోయిందట.. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అన్నట్టు రేవంత్ వచ్చి కేసీఆర్ మీద ఎగురుతుంటే.. అతనిలా మాటల ద్వారా సమాధానం చెప్పకుండా ముందు ఎందుకులే అని వదలేసిన కొడంగల్ ను టీఆర్ఎస్ వ్యూహం ప్రకారం టార్గెట్ చేసి రాజకీయంగా ఓడించాలని డిసైడ్ అయిపోయింది.

 

కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో రేవంత్ రెడ్డి తనను ఓడించాలరి టీఆర్ఎస్ కు సవాల్ చేసి శ్రుంగ‌భంగం కలిగించుకున్నాడని తెలుస్తోంది, రేవంత్ నోటి స్పీడు, ఓటుకునోటు, అక్రమాస్తులు, అధికార పార్టీకి కలిసొచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ రేవంత్ గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దిపినా, ఎంతైనా ఖ‌ర్చు చేసేందుకు సిద్దపడినా ఉపయోగం లేకుండా పోయిందట.. ఇక రేవంత్ గెలిచే అవకాశం లెదు అని నిశ్చయనికి వచ్చిన చంద్రబాబు రేవంత్ తో చీప్ పాలిటిక్స్ చేసే నీచమైన చర్యలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నరు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభంజనానికి ఖంగుతిన్న రేవంత్, రాహుల్ తో సభ పెట్టించుకున్నప్పటికి తన నియోజకవర్గం పరిస్థితి చేయి దాటిందని గుర్తించి, సానుభూతి కొరకు తనకు ప్రాణహాని ఉందనే కొత్త నాటకానికి తెరలేపినట్టు తెలుస్తోంది. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని బదిలీ చేయాలని కోరడం వెనుక తెలంగాణ అస్తిత్వాన్ని బాబు, కాంగ్రెస్ ద్వయం దెబ్బతీసే కుట్రకోణం రేవంత్ అమలు చేస్తున్నట్లుంది. అర్ధమవుతోంది. దీనికి కారణం రేవంత్ డబ్బుతో పట్టు బట్టప్పుడు తెలంగాణలో సెక్షన్8 చేయాలని చంద్రబాబు కోరినట్లు రేవంత్ ఇప్పుడు కోరుతున్నాడనేది తెలంగాణ బిడ్డల అభిప్రాయం.

 

అయితే రాజకీయ యుద్ధంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఓడించాలని టార్గెట్ పెట్టుకోవడం తప్పేమీ కాదు.. అందుకు వ్యూహ ప్రతివ్యూహాలూ సిద్ధం చేసుకున్నా తప్పులేదు. కానీ రేవంత్ చంద్రబాబు ఆదేశాలతో ఓటమి భయంతో తనను చంపుతారంటూ చీప్ వ్యాఖ్యలు చేయడాన్ని కొడంగల్ ప్రజలు గమనిస్తున్నరు. ముఖ్యంగా రేవంత్ నియోజకవర్గంలో సమస్యలను గాలికొదిలి టీఆర్ఎస్ పార్టీని నిరంతరం విమర్శిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్ ప్రజలను చిత్తశుద్ధితో ఆదరించి అన్ని ప్రభుత్వ పధకాలు అందించి అక్కున చేర్చుకుందనేది వాస్తవం.. ఈ కారణంతోనే కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టనున్నారనేది వాస్తవం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat