Home / 18+ / కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో?

కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో?

ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో ఆయన సీఎంగా చేసినప్పటి ఘోరాలు అన్న ప్రజలకు గుర్తుకొచ్చాయన్నారు.

కొన్ని టీవీ ఛానల్ లు, పేపర్లు కూడా కూటమికి అటాచ్ అయ్యాయి. మా స్నేహితులు ఎవరు.. శత్రువులు ఎవరో..? ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది.. మహా కూటమిని నడిపించే రెండు మీడియా సంస్థల వివరాలు.. డిసెంబర్ 11 తర్వాత చెబుతా” అన్నారు కేటీఆర్. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు ప్రయత్నించి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారని ఆరోపించారు. హరికృష్ణ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో తమ పార్టీతో పొత్తుపై మాట్లాడారని చెప్పారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో? ఏపీని లోకేశ్‌కు వదిలేసి చంద్రబాబు ఇక్కడకి వస్తాడేమో? అన్న అనుమానాలను వ్యక్తంచేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ను రూ.500 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేసినందునే రాహుల్ మొదలుకొని ఉత్తమ్ వరకు అందరూ అబద్ధాలు, తప్పులే మాట్లాడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 6న ఓ స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు టీఆర్‌ఎస్ గెలువబోతున్నదని లగడపాటి తనతో చెప్పి.. టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నించగా.. సాధ్యంకాదని తేల్చిచెప్పానన్నారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడంలో లగడపాటి కీలకపాత్ర పోషించారని చెప్పారు. అక్టోబరు 20 నుంచి చేసినట్లుగా చెప్పిన సర్వే ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు 65-70 స్థానాలు వస్తున్నాయని లగడపాటి తనకు వాట్సప్ ద్వారా పంపించారన్నారు. అయితే టీడీపీతో కలువనందునే కూటమిదే పైచేయంటూ మంగళవారం రాత్రి మరో సర్వే ఫలితాలను వెల్లడించారని స్పష్టంచేశారు. మైండ్‌గేమ్‌లో ప్రజలను కన్విన్స్ చేయలేక కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని.. దీనిలో భాగంగానే లగడపాటి సర్వే అని చెప్పారు. కూటమిలో నాలుగు పార్టీలే కాకుండా రెండు మీడియా సంస్థల అధిపతులు కూడా ఉన్నారని తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat