Home / 18+ / జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే

జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రినంటూ చెప్పుకున్న సీనియర్ నాయకులందరూ కారు జోరు ముందు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారు ఎవరుండబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖకు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణపై టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. డీకే అరుణను ఓడించినది ఆమె కుటుంబంలోని వ్యక్తే కావడం విశేషం. డీకే అరుణ మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో డీకే అరుణను ఓడిస్తానంటూ సవాల్ విసిరారు. అనుకున్న విధంగానే ఆమెపై కృష్ణమోహన్ విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జానారెడ్డినే ముఖ్యమంత్రి అంటూ అందరూ అనుకునేవారు. పైగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా ఆయనే. కాగా ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య జానారెడ్డిపై విజయం సాధించారు. అదే విధంగా ఆఖరి క్షణంలో సీటు తెచ్చుకున్న పొన్నాల లక్ష్మయ్య కూడా ఓటమి చెందక తప్పలేదు. జనగామ నుంచి పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతిలో ఓటమి చెందారు. నల్గొండ నియోజకవర్గాన్ని ఒంటి చేత్తో నడిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికీ పరాభవం తప్పలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డిని ఓడించి నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు.

కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలిచారు. అయితే కరీంనగర్ ప్రజలు ఆయనను ఆదరించలేదు. అలంపూర్ బరిలో నిలిచిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూాడా టీఆర్ఎస్ అభ్యర్థి వి.ఎం. అబ్రహం చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో పార్టీ మారిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆమెకు కూడా నియోజకవర్గంలో ఎదురుగాలే వీచింది. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆమెపై గెలుపొందారు.

ఇక జీవన్‌రెడ్డిని గెలిపించడానికి తన సీటును కూడా త్యాగం చేసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన శక్తినంతా పెట్టి ప్రచారం చేసినప్పటికీ పరాభవం తప్పలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిని ఓడిస్తానన్న తన పంతాన్ని నెగ్గిచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కారు గాలి ముందు హస్తం నిలవలేకపోయింది. ఒక్క ఖమ్మం జిల్లా తప్పితే మిగతా తొమ్మిది జిల్లాలలో కూడా టీఆర్ఎస్ పార్టీనే ముందంజలో ఉంది. ఇక లక్ష మెజారిటీతో గెలుస్తానన్న కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓటమితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. పది వేలకు పైగా మెజారిటీతో రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat