Home / 18+ / గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌ లాంచ్‌…దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ తదితర ఉత్పత్తులు

గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌ లాంచ్‌…దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ తదితర ఉత్పత్తులు

మనదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్‌ కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్‌ షాపింగ్‌’ పేరుతో కొత్త షాపింగ్‌ ప్లాట్‌ఫాంను గురువారం లాంచ్‌​ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్‌ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిందని గూగుల్‌ ప్రకటించింది. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు సహా వివిధ విభాగాలలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది.వివిధ కంపెనీల, బ్రాండ్ల ఉత్పత్తులను గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది.

వినియోగదారులు సరైన ఉత్పత్తులు, విక్రయించే రిటైలర్ల సమాచారాన్ని తెలుసుకోవడంలో సహాయపడేలా గూగుల్ షాపింగ్ పోర్టల్ల్‌ను డిజైన్‌ చేసినట్టు తెలిపింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ భాషలో ధరలు, బెస్ట్‌డీల్స్‌ తదితర సమాచారాన్నితెలుసుకునే వీలు కల్పించామని పేర్కొంది. లక్షలాదిమంది ఆన్‌లైన్ వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రీటైల్‌ వ్యాపారులకు ఇది గొప్ప అవకాశమని గూగుల్ షాపింగ్ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురోజిత్ చటర్జీ బ్లాగ్ పోస్ట్ లో రాశారు.

కాగా దేశంలో 400 మిలియన్లమంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉండగా వీరిలో కేవలం మూడవ వంతు వినియోగదారులు అసలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం లేదనిగూగుల్‌ పేర్కొంది. తమ గూగుల్‌ షాపింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రోత్సాహం అందించడంతోపాటు చిన్నమధ్యతరహా వ్యాపారస్తులను ఆన్‌లైన్‌ బిజినెస్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.అంతేకాకుండా త్వరలో డెస్క్‌టాప్‌తోపాటు ఎంట్రీ లెవల్ మొబైల్స్‌లో కూడా పనిచేసేలా ఒక ప్రోగ్రెసివ్‌ వెబ్‌యాప్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat