Home / 18+ / ధోనీ వచ్చేసాడు…

ధోనీ వచ్చేసాడు…

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులోకి మహీ వచ్చేశాడు. ఇక ఆసీస్, కివీస్‌తో వన్డే సిరీస్‌ల నుంచి యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు తప్పించారు. మేలో మొదలయ్యే ప్రపంచకప్ నాటికి వన్డేలు తక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చిన సెలెక్టర్లు మహీని తిరిగి టీ20లకు ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జట్టులో చోటు నిలుపుకున్నారు. ఇటీవలి ఆసియాకప్‌లో మెరుగ్గా రాణించిన స్పిన్ ఆల్‌రౌండర్ జడేజాకు వన్డే సిరీస్‌ల్లో చోటు దక్కినా టీ20ల్లో నిరాశే ఎదురైంది. మరోవైపు గత కొన్ని నెలలుగా కేవలం టెస్ట్‌లకు పరిమితమవుతూ వస్తున్న స్టార్ స్పిన్నర్ అశ్విన్..సెలెక్టర్ల కరుణ పొందలేకపోయాడు.

 

 

రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ తమ బెర్తులను నిలుపుకున్నారు. పేస్ బౌలింగ్ విషయానికొస్తే..భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ షమీతో టీమ్‌ఇండియా పటిష్ఠంగా కనిపిస్తున్నది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న స్పీడ్‌స్టర్ ఉమేశ్ యాదవ్ జట్టుకు దూరమయ్యాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న యువ పేసర్ ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా జట్టులో చోటు నిలుపుకున్నారు. ఆసీస్, కివీస్‌తో వన్డే సిరీస్‌లకు దూరమైన రిషబ్ పంత్..వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో ఆడనున్నాడు. టెస్ట్‌ల్లో వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతున్న అజింక్యా రహానే రెండు సిరీస్‌ల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ వచ్చే నెల 12న మొదలవుతుండగా, కివీస్‌తో వన్డే సిరీస్ 23న ప్రారంభం కానుంది. ఆసీస్, కివీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: కోహ్లీ(కెప్టెన్), రోహిత్‌శర్మ(వైస్ కెప్టెన్), రాహుల్, ధవన్, రాయుడు, కార్తీక్, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్‌యాదవ్, చాహల్, జడేజా, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, షమీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat