Home / 18+ / బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు

బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ తూకాల మోసాలు కూడా షరా మామూలే.

గతంలో వైయస్‌ఆర్‌ హయాంలో రూ.187లకే 9 రకాల సరుకులు రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తే చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే క్రమంగా అన్నిటినీ ఎత్తివేసారు. కొన్నాళ్లపాటు కేవలం రేషన్‌ బియ్యం మాత్రమే పంపిణీ చేసినా టెక్నాలజీ పేరు చెప్పి లబ్ధిదారులకు విసుగు పుట్టించారు. మళ్లీ ఈపోస్‌ విధానంతో రేషన్‌ తీసుకోవాలంటే లబ్ధిదారులు బెంబేలెత్తిపోయారు. గ్రామాల్లో ఈపోస్‌ మెషీన్లకు సిగ్నళ్లు అందక గంటల కొద్దీ క్యూలైనల్లలో నిలబెట్టాడు. రేషన్‌ తీసుకునేందుకు లబ్ధిదారులు కూలీ పనులు మానుకుని రోజంతా నిరీక్షించాల్సి వచ్చేది. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం లబ్ధిదారులకు విసుగుపుట్టించి రేషన్‌ అంటేనే చిరాకు పుట్టేలా చేశారు.

చివరకు లబ్ధిదారులను ఒక్కొక్కరిగా రేషన్‌ షాపులకు దూరం చేయగా.. చివరికి ఎవరూ రేషన్‌ తీసుకోవడం లేదనే నెపం చూపించి రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకే ఎగనామం పెట్టేశారు. మళ్లీ ఏవో బహుమతులు ఇస్తున్నట్టు సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్‌ సమాయాల్లో మాత్రం నాలుగైదు రకాల సరుకులు పంపిణీ చేస్తున్నాడు. అది కూడా తెలంగాణలో కేసీఆర్‌ పంపిణీ చేయడం చూసి తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తున్నారు. పబ్లిసిటీ కోసం చంద్రన్న కానుక అని పేరు పెట్టుకుని పుచ్చిపోయిన కంది పప్పు, పాచిపోయి బూజు పట్టిన బెల్లం, కంపు కొడుతున్న నెయ్యి, ఏళ్ల నాడు మిగిలిపోయిన శనగలు, కాలం చెల్లిన గోధుమ పిండి పంచారు.

సంక్షోభాలను అవకాశాలను మలుచుకోవాలని చెప్పే చంద్రబాబు ఇక్కడా తన స్వలాభం కోసం హెరిటేజ్‌ నెయ్యిని పంపిణీ చేసి తన కంపెనీకి లాభాలు చేకూర్చే ప్రయత్నం తప్ప పండగ కానుక ఇవ్వాలనే కాదని మహిళలు తిడుతున్నారు. ఈ సరుకులు ఎందుకూ పనిచేయవని అటువంటివి తమకు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మీ ఇంట్లో ఇటువంటి సరుకులు తింటారా ముఖ్యమంత్రి గారూ.. అని ప్రశ్నిస్తున్నారు. మీ మనవడు దేవాన్ష్ కు ఇవి పెడతారా అంటూ నిలదీస్తున్నారు మహిళలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat