Home / 18+ / ఎందుకూ ఉపయోగపడని అమరావతి నుంచి జగదల్ పూర్ కు వంతెన వేస్తున్న చంద్రబాబు..

ఎందుకూ ఉపయోగపడని అమరావతి నుంచి జగదల్ పూర్ కు వంతెన వేస్తున్న చంద్రబాబు..

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం వద్ద రూ.1387 కోట్లతో ఐకానిక్ వంతనకు శంకుస్థాపన చేసారు.. ప్రపంచమంతా ఈవంతెన చూడటానికి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పాలన పడకేయగా.. చంద్రబాబు మాత్రం శంకుస్థాపనలు, కొత్త కొత్త పేర్లతో జనాలను మోసం చేసే స్టంట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు సమీపంలో ఉండగా ఈ శంకుస్థాపనలన్నీ ఓట్ల కోసం జరిగే స్టంటులే అన్న సంగతి చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. మళ్లీ ప్రధాని మోదీ డబ్బులివ్వడం లేదని, తన దగ్గర డబ్బులు లేవని చంద్రబాబు ప్రతి శంకుస్థాపనలోనూ చెబుతున్న మాట. కేంద్రం నిధులు ఇవ్వడంలేదు.

రాష్ట్రానికి ఆదాయ మార్గాలూ లేవు మరి ఈ శంకుస్థాపనలన్నీ ఎందుకు అంటే కచ్చితంగా ప్రజలను మభ్యపెట్టడానికే.. మీరంతా నాకు సహకరించాలి.. అంటే మళ్లీ తనను నమ్మి ఓట్లేయాలి. వేస్తే అప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు అంచనాలు పెంచి సొంత గూటి కంపెనీలకు వాటిని కట్టబెట్టి ముడుపులు సంపాదించుకుంటారన్నమాట.. అసలు విషయానికొద్దాం.. విజయవాడ నుంచి అమరావతికి రోడ్డు ద్వారా 42.9 కిలోమీటర్లు.. అంటే సుమారు రెండు గంటలకంటే తక్కువే ప్రయాణం.. అలాంటి ప్రయాణాన్ని తగ్గించడం కోసం పవిత్ర సంగమం నుంచి తాళ్లపాలం, రాయపూడి దాకా పిల్లర్లు వేసి వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టి వంతెన కడతాడట..

ఇదంతా తాత్కాలిక భవనాలు కూడా సరిగ్గా పూర్తిగా నిర్మాణం కాని రాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు సమయం ఆదా చేస్తుందట.. ఈ వంతెనవల్ల హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ లోని జగదల్ పూర్ కు వెళ్లేందుకు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుందట. నిజానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు పెద్దగా ఉన్నది లేదు. మావోల ప్రభావిత ప్రాంతంగా తప్ప ఏపీ తెలంగాణాలు ఛత్తీస్ ఘడ్ తో వేరే వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నది కూడా లేదు. కేవలం 2 గంటల సమయం ఆదా చేసేందుకు అదీ హైదరాబాద్ నుంచి జగదల్ పూర్ కు వెళ్లే సమయం ఆదా చేసేందుకు ఆంధ్రా ముఖ్యమంత్రి ఇంత ఖరీదైన వంతెన నిర్మించాలనుకుంటున్నాడని అందరూ నవ్వుకుంటున్నారు.

పోనీ విజయవాడలో ట్రాఫిక్ భారం తగ్గేందుకు ఈ వంతెన అసలు ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు.. బాబు దృష్టిలో ఇదో పర్యాటక వంతెన.. దీన్ని దక్కించుకున్న ఎల్ అండ్ టీ రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతోంది. కానీ మూడేళ్లు దాటినా సగం పని కూడా పూర్తికాని కనకదుర్గ వారధి చూస్తేనే ఈ మాటలు ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తాయన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే గతంలో 2017జూన్ లో అమరావతి డెలవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచినప్పుడు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టు 800 కోట్లే. కానీ ఏడాదిలోపే అంటే 2018 కి దీని అంచానా విలువ పెరిగిపోయి ఏకంగా 1300 కోట్లను దాటింది.. ఇది చూస్తున్న రాజధాని ప్రాంతవాసులు ఆహా ఇది కదా అసలు మేటర్ అనుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat