Home / 18+ / ఏపీ ఎన్నికలపై దరువు ఫ్లాష్ టీం సర్వే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.?

ఏపీ ఎన్నికలపై దరువు ఫ్లాష్ టీం సర్వే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.?

వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియా కాస్త అటుఇటుగా ప్రాంతీయ మీడియా, ప్రాంతీయ సర్వే సంస్థలు, చానెళ్లు ఇష్టానుసారంగా ఫలితాలివ్వగా దరువు నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది.. వెబ్ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దరువు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాప్రయోజనం కోసమే చేసింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేసినపుడు అభినందించడంతోపాటు ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేసినపుడు నిలదీసింది. గతంలో దరువు చెప్పిన సమాచారమంతా అక్షరసత్యం అయ్యింది. పార్టీల్లో చేరికలు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపోటములను ముందుగానే వెల్లడించింది దరువు.

అలాగే తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ నైపుణ్యం, అనుభవం కలిగిన యువతతో సర్వే చేసిన దరువుటీం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించి ఓటర్ల నాడి తెలుసుకుంది. కచ్చితమైన ఫలితాలను వెల్లడించింది అలాగే నూటికి నూరుశాతం దరువు సర్వే నిజమైంది. ఈ నేధ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ దరువు సర్వే చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందే దరువు చేసిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తేలింది. దాదాపుగా మూడు లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది దరువు.. వీరిలో రకరకాల కారణాలతో 72శాతం ప్రజలు ఈసారి జగనే ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టు తేలింది. తాజాగా జాతీయ మీడియా జరిపిన సర్వేలోనూ ఏపీలో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది.

రానున్న ఎన్నికల్లో వైసీపీ 118 నుండి 130 సీట్లతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే సంకేతాలు వ్యక్తమయ్యాయి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, రేషన్ సరుకుల పంపిణీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోకపోవడంతో యువత అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అంతులేని అవినీతి, శ్రీవారి ఆభరణాల మాయం, రాజధానిలో భూముల అన్యాక్రాంతం, ఆరోగ్యశ్రీ ని నడపకపోవటం, 108, 104లను షెడ్లకే పరిమితం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన కుల ఘర్షణలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రత్యేకహోదా ఉద్యమంపై ఆంక్షలు విధించడం వంటివి సామాన్యుల మనసులో నాటుకుపోయాయి.

ముఖ్యంగా హోదా విషయంలో తెలుగుదేశం ఎంపీలు వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి నిధులు సాధించిన విధానాన్ని ప్రజలు గమనించారు. బీజేపీపై పోరాడలేని తత్వాన్ని ప్రజలు చర్చించుకున్నారని తేలంది. మొత్తంగా 65% ప్రజలు టీడీపీ పాలన అస్సలు బాగలేదని, 15% పర్వాలేదని, మరో 12% చాలా బాగుందని మరో 8% ప్రజలు ఇంకా చెప్పలేం అంటూ సమాధానాలిచ్చారు. ఎంపీ స్థానాల్లో కూడా 21సీట్లు వైసీపీ 4 సీట్లు తెలుగుదేశం గెలుచుకోనున్నట్టు ప్రజలు అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీకి సంబంధించి ఎంపీ స్థానాలపై ఎలాంటి కనీస ప్రభావం ఉండదని తేలింది. అసెంబ్లీకి సంబంధించి ఏపార్టీకి ఎన్ని స్థానాలు రానున్నయనే అంశంపై దరువు సర్వే తుదదశకు చేరుకున్నందున మరో రెండ్రోజుల్లో అసెంబ్లీకి సంబంధించి ఏయే జిల్లాల్లో ఏపార్టీకి ఎన్నిసీట్లు రానున్నాయనే సర్వేను ప్రకటించనున్నామని తెలియజేస్తున్నాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat