Home / Uncategorized / కాళేశ్వరంలో ‘మేఘా’ వినూత్న ప్రక్రియ

కాళేశ్వరంలో ‘మేఘా’ వినూత్న ప్రక్రియ

సాగునీటి పారుదల రంగంలో భూములకు నీరందించేందుకు సరికొత్త పద్ధతికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. ఆసియాలో తొలిసారిగా భారీ స్థాయిలో పైపుల ద్వారా నీరందించే పద్దతిని ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అమలు చేస్తోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎంఈఐఎల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పైప్లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని అమలు చేస్తుందని మేఘా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌ బొంతు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కాలువల ద్వారా సాగు భూములకు నీరు అందించే పద్ధతి లో కాలువల ద్వారా సాగు భూములకు నీరు అందించే పద్ధతి లో నీటి వృధా ఎక్కువగా ఉంటునందున దానిని నివారించేందుకు పైపుల ద్వారా నేరుగా రైతుల పొలాలకే పైపులతో నీటిని సరఫరా చేసేలా పనులను ప్రయోగాత్మకంగా చేపడుతోంది. ఇంతవరకు సాగునీటి ప్రోజెక్టుల క్రింద నేరుగా ఆయకట్టుకు నీరు అందించేందుకు ఎక్కడ ఏర్పాటు చేయని విధంగా 6130 కిలోమీటర్ల పైపులైన్లను వ్యవస్యా భూముల్లో ఏర్పాటు మేఘా చేయనున్నారు.

ఇజ్రాయేల్‌ టెక్నాలజీ సహాయంతో పైప్‌లద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్‌ పనిచేస్తోంది. కాళేశ్వరం ప్యాకేజీ-21 లో భాగంగా ఈ పైపుల ద్వారా పంటకు నీరందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన నీటి ఆవిరి నష్టంగాని, ఇంకుడు నష్టం గాని ఉండదు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి పైప్‌లైన్‌ ఇరిగేషన్‌ వ్యవస్థకు మంచి ఆదరణ లభించింది. కాలువ ద్వారా వెళ్లే నీరు ఆవిరి కాకుండా పైప్‌లైన్‌ ఇరిగేషన్‌ ద్వారా నేరుగా రైతుల పొలాలకే పైపులతో నీటిని సరఫరా చేసే పనులను ప్రయోగాత్మకంగా చేపడుతుంది.

కాళేశ్వరం ప్యాకేజ్‌-21లో భాగంగా జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలో లక్షల ఎకారలకు పైప్‌లైన్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగునీరు అందించాలనేది లక్ష్యం. గడ్కోల్‌, మెట్‌పల్లి ప్రాంతాలలో 80,000 హెక్టార్ల పంటకు నీటిని సరఫర చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గడ్కోల్‌ ప్రాంతంలో 34,000, మెట్‌పల్లి ప్రాంతంలో 46,000 హెక్టార్లకు సాగునీరు అందేలా ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేస్తోంది. ఒక టిఎంసీ నీటితో 10 వేల ఎకారలు సగటున సాగు చేయవచ్చు. ఇందుకోసం శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని వినియోగించాల్సి ఉంటుంది. మెట్‌పల్లి ప్రాంతంలో ఒక రిజర్వాయర్‌ని నిర్మించాలి. ఈ రిజర్వాయర్‌ కోసం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాం సాగర్‌ నుంచి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 2.5 మెగావాట్ల విద్యుత్‌
వినియోగించేలా 10 పంప్‌లను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల కాలువ సమీపంలోని రైతులకు మోటార్లు వినియోగించాల్సిన అవసరం ఉండదు.

కొందం చెరువు, మంచిప్ప చెరువును పైప్లైన్ల ద్వారా అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టు విశిష్టత. మొత్తం 6,129 కిలోమీటర్ల ప్రెషరైజ్డ్‌ పైప్లైన్‌ నెట్వర్క్ను ఎంఎస్‌, డీఐ, హెచ్డీపీఈ పైపు ద్వారా ఏర్పాటు చేయనున్నారు. పైపులైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి. 150 కిలో మీటర్ల ఎంఎస్‌ పైప్‌ లైన్‌ నెట్వర్క్లో ఇప్పటికే 11.4 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే 282కిలో మీటర్ల డీఐ పైపైలైను పనుల్లో 10 కిలోమీటర్లను పూర్తిచేసింది. భారీ ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో పైపుల ద్వారానే నీటి దుబారా అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పైప్‌లైన్‌ ఇరిగేషన్‌
విజయవంతంమైతే ఇతర ప్రాంతాలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
గడ్కోల్ లో ‘మేఘా’ 3.5 టీఎంసీల రిజర్వాయర్:
నిజామాబాదు జిల్లాలోని గడ్కోల్ ప్రాంతంలో కొండంచెరువు, మంచిప్ప చెరువును అనుసంధానించడం ద్వారా 3.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించి ఆతర్వాత పంపింగ్ పనులను మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ రెండు పంపింగ్ స్టేషన్లను నిర్మించనుంది. అందులో మొదటిది మెట్ పల్లి వద్ద ఒక్కోపంపు 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పది పంపులతో పంపింగ్ స్టేషన్ నిర్మించనుంది. అలాగే గడ్కోల్ వద్ద 8 పంపులతో ఒక్కో పంపు 2 మెగావాట్ల సామర్థ్యంతో రెండవ పంపింగ్ స్టేషన్ నిర్మించనుంది.

ఓఎంఎస్ తో మంచి దిగుబడులు:
భారీ ఎత్తిపోత పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే భవిష్యత్తులో పైపుల ద్వారానే సాగునీటిని అందించడమే ఉత్తమ మార్గమని, నీటి దుబారాను అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైప్ ఇరిగేషన్ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించవ్చని, ఈ విధానం ద్వారా దిగుబడులు పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాళేశ్వరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పైప్లైన్ ఇరిగేషన్ విజయవంతంమైతే ఇతర ప్రాంతాలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat