Home / 18+ / కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్‌ బాబ్జీ త్వరలో వైసీపీలోకి

కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్‌ బాబ్జీ త్వరలో వైసీపీలోకి

సీనియర్‌ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో కొద్ది రోజులుగా వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టమైన సంకేతా లిచ్చారట.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపే అంశంపై చర్చలు తుదిదశలో ఉన్నట్టు చెబుతున్నారు.

ఇదంతా వైసీపీలో బహిర్గతంగానే ప్రచారం జరుగు తుంది. ఏలూరు ఎంపీగా రెండుసార్లు ఎన్నికై రాజకీయంగా బలం కలిగిన కావూరు సాంబశివరావుతో ప్రశాంత్‌ కిషోర్‌ స్వయంగా దౌత్యం నడుపుతున్నారట.. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు తుది ప్రయత్నాల్లో ఉన్నారట.. కొద్ది రోజుల క్రితం కావూరికి ఏలూరు లోక్‌సభకు టికెట్‌ ఇస్తాం అనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారట. కాంగ్రెస్‌ను వీడిన తరువాత టీడీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థిక స్తోమత, సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కావూరిని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సమ్మతించారట.. జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కన్వీనర్‌గా కోటగిరి శ్రీధర్‌ ఉన్న కారణంగా కావూరికి వేరే స్థానం ఇస్తారా లేదా, ఎమ్మెల్యే స్థానం ఇస్తారా అనేది వేచి చూడాలి. అదేకోవలో పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ కూడా వైసీపీలోకి రానున్నారట.. టీడీపీ సైతం నేరుగా బాబ్జీని తమ పార్టీకి రావాల్సిందిగా ఎమ్మెల్యే రామానాయుడును దౌత్యానికి పంపింది. అది ఎటూ తేలలేదు. కానీ వైసీపీ సీనియర్‌ నేతలు కొందరు బాబ్జీతో టచ్ లో ఉన్నారట. నిరాడంబరంగా, వైద్య వృత్తికే కట్టుబడి ఉన్న బాబ్జీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక స్తోమత లేదని, ఇప్పుడున్న రాజకీయాల్లో ఇమడలేనని చెబుతూ వస్తున్నారు. వైసీపీ పట్టు వీడకుండా సంప్రదింపుల నిమిత్తం పార్టీ సీనియర్‌ నేత విజయ సాయిరెడ్డి మాట్లాడగా.. ఒకవేళ బాబ్జీ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

అలాగే నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారట.. వాస్తవానికి నరసాపురం లోక్‌ సభ నుంచి తగిన అభ్యర్థి లేక వైసీపీ నానాపాట్లు పడుతోంది. ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గానికే టికెట్‌ ఇవ్వాలని వైసీపీ గతంలో నిర్ణయించింది. దీంతో ఎంపీ గోకరాజు తనయుడు రంగరాజును పోటీకి దింపేం దుకు వైసీపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. బీజేపీలో కీలకంగా ఉన్న గంగరాజు కుటుంబం నుంచి చీలిక సాధ్యమేనా అనే చర్చ ఆరంభమైంది. చాలా కాలంగా రంగరాజు పేరు ప్రచారంలో ఉంది. అయితే గంగరాజు లేదా ఆయన కుమారుడు వైసీపీ ఎంపీలుగా బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat