Home / 18+ / కడప జిల్లాలో దారుణం.. వైసీపీ నేత కారు తగలబెట్టిన టీడీపీ గూండాలు

కడప జిల్లాలో దారుణం.. వైసీపీ నేత కారు తగలబెట్టిన టీడీపీ గూండాలు

వైయస్‌ఆర్‌ (కడప) జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం హద్దులు దాటిపోయింది. వైసీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టారు టీడీపీ గూండాలు.. ఈ ఘటన కొండాపురం మండలం ఏటూరులో తాజాగా చోటు చేసుకుంది. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందినవారిని బూత్‌ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా అధికార తెలుగుదేశం పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

 

కానీ చాలామంది మా ప్రాణాలు పోయినా జగన్‌ వెన్నంటే ఉంటామని, బూత్‌ల్లో ఏజెంట్లు చేరతామని చెప్తున్నారు. వీరిలో వైసీపీ నేత అల్లం సత్యం కూడా జగన్ తో ఉంటామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు సత్యం కారును కక్ష పూరితంగా దహనం చేశారట.. ఈ విధంగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరతీస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.