Home / 18+ / పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్..

పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్..

సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. కత్తి మహేష్‌ వివాదంలో కూడా పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను.అలాంటి పవన్  రాజకీయాల్లోకి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశపడుతున్నారని అన్నారు. ఇవ్వన్ని చెప్పేది వేరెవరో కాదు..మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్.తాజాగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మాటలు సరికాదని.ఇక్కడ హైదరాబాద్‌లోనే కాదు.తెలంగాణలో  మారుమూల పల్లెల్లో ఉంటున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. పవన్‌ ఇలాంటి ప్రకటనలను ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో అర్ధం కావడం లేదని మండిపడ్డారు.

మాయావతితో పొత్తు పెట్టుకున్న పవన్‌ కళ్యాణ్… ఆరోపణలు తప్ప ఒక్క కేసు కూడా నిరూపణ కాని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ఇలా మాట్లాడడం అన్యాయం అని,ఆయననే లక్ష్యంగా చేసుకుని పవన్‌ విమర్శలు అందుకు చేస్తారో అర్ధం కాదన్నారు.వైఎస్ఆర్ కుటుంబం నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలే శ్వాసగా బతికే కుటుంబం అని చెప్పారు.అలాంటి కుటుంబం పై తప్పుగా మాట్లాడడం సరికాదని పోని మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కనీసం ఒక్కదానికైనా ఆధారం చూపించండి.అది నిజం అయితే నేను జనసేన జెండా పట్టుకుని మీ వెనకే ఉంటానని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat