తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సర్వం సిద్దం అయినట్లే.ఇప్పటికే ఈ షో వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఅర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.అయితే ఎన్టీర్ రాకతో ఈ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి రేటింగ్ కూడా వచ్చింది.ఇక రెండో సీజన్ కు యాంకర్‌గా న్యాచురల్ స్టార్ నాని ఉండగా తనదైనశైలిలో షో మొత్తానికి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టాడు.ప్రస్తుతం బిగ్‌బాస్ మూడో సీజన్ కు రెడీ అవుతుంది.అయితే ఎన్టీర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు..ఇక నాని ఐతే సీజన్2 లోనే ఇక తను యాంకరింగ్ చేయనని చెప్పేసాడు.
అయితే బిగ్‌బాస్ యాజమాన్యం కొత్త హోస్ట్‌ను వెతికే పనిలో పడింది.ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ,వెంకటేష్,రానా పేర్లు లిస్టు లో ఉన్నాయి.కాని చివరికి టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఫైనల్ చేసింది యాజమాన్యం.నాగ్‌కు ఇప్పటికే కొన్ని రియాల్టీ షో లో చేసిన అనుభవం ఉంది.అంతేకాకుండా గతంలో మీలో ఎవరు కోటేశ్వరుడు షోకి యాంకర్‌గా చేసారు.దీంతో బిగ్‌బాస్ యాజమాన్యం నాగ్ ను ఫిక్స్ చేసింది.ప్రస్తుతం నాగ్ ‘మన్మధుడు 2’ షూటింగ్ లో ఉన్నాడు.అది అవ్వగానే బిగ్‌బాస్ 3కు పనిచేయనున్నారు నాగ్.