చాలా మంది టాలీవుడ్ హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని అందరికి తెలుసు.వెంకటేష్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే క్రికెట్ ఎక్కడ ఉంటే వెంకటేష్ అక్కడే ఉంటాడు.మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది.ఇప్పటికే అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.అయితే మన టాలీవుడ్ హీరోలు మహేష్, వెంకటేష్ 10రోజులు యూకే ట్రిప్ కు రెడీ అవుతున్నారు.వీరి ట్రిప్ సినిమా షూటింగ్ కి కాదండి..ప్రపంచకప్ కోసమట.లండన్ లో ఇండియా ఆడబోయే ప్రతీ మ్యాచ్ చూస్తారట.ఈ 10రోజుల తరువాత మన సెమీస్ కి వస్తే అక్కడే ఉండడానికి ప్లానింగ్ లో ఉన్నారట.మహేష్ కి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం..కాని ఇప్పటివరకూ మ్యాచ్ లకు వెళ్లలేదని చెప్పాలి.వెంకటేష్ మాత్రం డొమెస్టిక్ మ్యాచ్ లకు కూడా వెళ్లి సపోర్ట్ చేసేవారు.