Home / 18+ / టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.. జగన్ ధాటి తట్టుకోలేకే చంద్రబాబు

టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.. జగన్ ధాటి తట్టుకోలేకే చంద్రబాబు

ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైఎస్సార్‌సీపీ మొదటి స్థానంలో ఉంటదని స్పష్టమైంది. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుంది. 2014 ఓటమి తర్వాత నుంచి జగన్‌ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్‌ వర్క్‌ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడం వైసీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలుగా తెలుస్తున్నాయి. హోదా విషయంలో చంద్రబాబు కప్పదాటు వైఖరి, పార్టీకోసం జగన్‌ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో తీసుకున్న జాగ్రత్తలు వైసీపీ విజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో జగన్‌ పార్టీ ఉత్తర కోస్తాలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో సీట్లు కోల్పోవడం.. ఈఎన్నికల్లో మాత్రం వైసీపీకి 45 శాతం, టీడీపీకి 38 శాతం ఓట్లు రానున్నాయనేది వాస్తవరూపం దాల్చనుంది.

 

ఓట్లలో 8 శాతం మార్పువచ్చినా 70 సీట్లవరకు తేడా కచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా రాజకీయ అభద్రతతోనే చంద్రబాబు ఢిల్లీవైపు చూస్తున్నారు.. ఏపీలో జగన్‌ను ఎదుర్కొనే ధైర్యంలేక చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టానంటూ ఢిల్లీచుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలపై విపక్షనేతగా దేశంలో ఏ నాయకుడూ చేయని పోరాటం జగన్ చేసారనే చెప్పుకోవాలి. దీని ప్రకారం చూస్తే చంద్రబాబు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా నాలుగు c లు చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

Capital.. రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి, తాత్కాలిక రాజధాని నిర్మించి వేలకోట్లు దోచుకుని, రైతుల భూములు 30వేల ఎకరాలు తీసుకోవడం ఇప్పటివరకూ శాస్వత రాజధాని పేరిట ఒక్క ఇటుక కూడా వేయని విధానం..

Caste politics.. ఈ నాలుగేళ్లలో కుల రాజకీయాల ప్రభావం పెరిగిపోయింది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ప్రధాన అధికారులే ఈ విషయాన్ని వెల్లడించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుల ఘర్షణలు విపరీతంగా పెరిగిపోయాయి.

Corruption.. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన అవినీతి పేరుకుపోయింది. భూమి, మట్టి, ఇసుక, నీరు ఇలా ప్రతీ అంశంలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. పోలవరం, రాజధాని దగ్గరనుంచి జన్మభూమి కమిటీల్లో జరిగిన అవినీతి పట్ల ప్రజలు విసుగెత్తిపోయారు.

Collection.. తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన చాలామంది బడానేతలు సైతం ఓడిపోవడానికి ప్రధాన కారణం వసూళ్లు.. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ దారుల దగ్గరనుంచి వ్యాపారవేత్తలవరకు, ప్రభుత్వ శాఖల్లోని పలు డిపార్ట్ మెంట్లనుంచి విపరీతంగా అవినీతికి పాల్పడడం చర్చనీయాంశమైంది. అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రభుత్వ పధకాలు అందడం వరకూ చేసిన కలెక్షన్లకు అంతూ పొంతూ లేకుండా పోవడం ఇందుకు కారణాలుగా తెలుస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat