Home / EDITORIAL / ప్రజా తీర్పునకు వందనం-ఎడిటోరియల్

ప్రజా తీర్పునకు వందనం-ఎడిటోరియల్

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన్నికల తీర్పు. భారతీయ జనతా పార్టీ విజయం అపూర్వమైనది. దేశ చరిత్రలో ఇప్పటివరకు కాంగ్రెస్ మాత్రమే ఇన్ని స్థానా లు గెల్చుకున్న పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. మరే కాంగ్రెసేతర పార్టీకి అటువంటి అవకాశం మునుపు రాలేదు. ఇప్పుడు బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు, కూటమిగా 353 స్థానాలు గెల్చుకొని చరిత్ర సృష్టించింది. బీజేపీ విధానాలు అభ్యంతరకరంగా ఉన్నమాట నిజం. మతం, జాతీయత పునాదులపై ఆ పార్టీ సృష్టిస్తున్న భావోద్వేగా లు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని మేధావివర్గం అభిప్రాయపడిన విషయ మూ వాస్తవం. బీజేపీ దేశం ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నుంచి భావోద్వేగ సమస్యల వైపు ప్రజలను మళ్లిస్తున్నదన్న విమర్శ కూడా మొదటి నుంచి ఉన్న ది. అయితే ఆ భావోద్వేగాల ఎజెండా ఒక్కటే ఆ పార్టీని గెలిపించలేదు. స్థిరమైన బలమైన పార్టీగా, ఎదురులేని ప్రత్యామ్నాయంగా బీజేపీ ప్రజల మన్నన పొందింది. గత ఆరు మాసాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జోడీ సాగించిన ఎన్నికల ప్రచారోద్యమం మునుపెన్నడూ ఏ పార్టీ చేయనిది. ఎన్నికల విజయంకోసం సమస్త బలాలను, బలగాలను మోహరించిన తీరు, పార్టీ యంత్రాంగాన్ని ఏకోన్ముఖంగా నడిపించిన తీరు అసాధారణమైనది.బీజేపీ ఒకసారి వస్తే పాతుకుపోతుందని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. ఏ పార్టీ అయినా ప్రజల విశ్వాసం పొందినంతకాలమే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ అనుకోలేదు. ఆ ఓటమి శాశ్వతం కాదని ఆరుమాసాల్లోనే మళ్లీ రుజువైంది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 4 లోక్‌సభ స్థానాలను, 18 శాతం ఓట్లను బీజేపీ సంపాదించింది. 1999 వచ్చేసరికి చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని ఏడు సీట్లు గెల్చుకున్నది. 2004 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి అన్నిస్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అందుకే పాతుకుపోవడాలు, శాశ్వతా లేవీ ఉండవు. ఏ ప్రజా తీర్పూ శాశ్వతం కాదు. అంతిమమూ కాదు.

ఆరు మాసాల కిందట ఇదే నరేంద్రమోదీ- అమిత్ షాల నాయకత్వంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఎన్నికలు జరిగితే ప్రజలు బీజేపీని ఓడించారు. ఏడు లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఓడించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ ఐక్య సంఘటనగా ఏర్పడి బీజేపీని ఓడించాయి. ఇక నరేంద్ర మోదీ పని అయిపోయిందన్న భావన అంతటా వినిపించింది. బహుశా ఈ ఓటమి నుంచి నరేంద్ర మోదీ, అమిత్ షా చాలా గుణపాఠాలను నేర్చుకొని ఉంటారు. ఎక్కడ దారితప్పామో, ఏమి చేస్తే మళ్లీ ప్రజలను గెల్చుకోగలమో సమీక్షించుకొని ఉంటారు. ఆ సమీక్షల నుంచే భావోద్వేగాల ఎజెండాను మరింత శక్తిమంతంగా ముం దుకుతెచ్చారు. పుల్వామా సంఘటన మొదలు ఏ ఒక్క అవకాశా న్నీ వదలలేదు. మరోవైపు మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఉప ఎన్నికల విజయం ప్రతిపక్షాల కొంప ముంచాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఎవరికి వారే చెలరేగిపోయే దుస్సాహసం ఆ పార్టీలలో పెరిగాయి. ఎస్పీ-బీఎస్పీలైతే కాంగ్రెస్ ను కనీసం సంప్రదించకుండా ఓ రెండు స్థానాలు ఆ పార్టీకి వదిలేసి తమ పొత్తును ప్రకటించుకున్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏ ఒక్కరినీ దగ్గరికి తీసే ఆలోచన చేయలేదు. ఢిల్లీలో కాం గ్రెస్, ఆప్‌లు అం తే మూర్ఖంగా వ్యవహరించాయి. కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీఎస్పీని దగ్గరకు రానీయలేదు. ఇక్కడితో ఆగలేదు. ఎవరికివారే ప్రధానమంత్రి అభ్యర్థులుగా ప్రకటించుకునే దాకా వెళ్లా రు. ఒకవైపు బీజేపీ తిరుగులేని నరేంద్ర మోదీ నాయకత్వంలో పోరాడుతుంటే, ఇటువైపు ఒక సంఘటిత రాజకీయశక్తి లేకపోయింది. ముక్కలుముక్కలుగా ఎవరికివారే యుద్ధం చేశారు. కాంగ్రెస్ యువ నాయకత్వం చేతికివచ్చినా ఇంకా దానిని వృద్ధా ప్యం వీడటం లేదు. పాత వాసనలు, పాత పోకడలు, అదే మూస రాజకీయ ప్రదర్శన. త్యాగాలు చేసైనా అన్ని పార్టీలను ఒక్కతాటిపైకి తేవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ చేయవలసింది.

ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటనగా ఆవిర్భవించవలసింది. బీజేపీ నాయకత్వం పదేపదే విమర్శిస్తూ వచ్చినట్టు టుక్డా టుక్డా పార్టీలపై ప్రజలకు ఏవిధంగా నమ్మకం కలుగుతుంది? వీరికి ఓట్లేస్తే ఏమవుతారని నమ్మాలి? పైగా మాయావతి, మమతాబెనర్జీ, లాలూప్రసాద్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ వీళ్లందరూ ఇప్పటికే రాజకీయంగా పదేపదే దెబ్బతిని, ప్రజల విశ్వాసాన్ని అనవసరమైన పరీక్షలకు గురిచేస్తూ వచ్చారు. వీరిపట్ల ఒక నిరసన, అసం తృప్తి జనంలో తలెత్తింది. ఈ పార్టీలకు ఓట్లేస్తే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని, దేశం ఆగమవుతుందని సమాజంలోని ఉన్నతవర్గాలు, ఉన్నత కులాలు, వెనుకబడిన కులాల్లోని సంపన్న వర్గాలుభావించాయి. వ్యాపార వర్గాలు మునుపెన్నడూ లేనంత సంఘటితంగా మోదీ వెంట ర్యాలీ కావడం ఈ ఎన్నికల్లో కనిపించింది. రాహుల్‌గాంధీ మూడు రాష్ర్టాలలో అధికారంలోకి వచ్చి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని కాపాడుకోలేకపోయారు. ఆయన ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను అధికారంలో ఉన్న రాష్ర్టాలలో కూడా సరిగా ప్రచారం చేసుకోలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడిపోయింది. ఇతర పార్టీల తో పొత్తులు పెట్టుకోవడం తప్ప ఒంటరిగా మోదీని, బీజేపీని ఎదుర్కొనే శక్తి, పునాదులు ఆ పార్టీకి లేవు. అందుకే మూడు మాసాల కిందట కాంగ్రెస్‌ను గెలిపించిన మూడు రాష్ర్టాలు తిరిగి ఆ పార్టీని ఓడించి మళ్లీ బీజేపీకి బ్రహ్మరథం పట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక శాతం ప్రజలు ఓటు బ్యాంకు రాజకీయాలను బద్దలుకొట్టి బీజేపీకి జై కొట్టారు. గతంలో మాదిరిగా ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీలు సంఘటితంగా పోరాడి ఉంటే కచ్చితంగా ఉత్తరప్రదేశ్‌లో మరో డజను సీట్లయినా గెలుచుకొని ఉండేవి.

కాంగ్రెస్ కారణంగా ఎస్పీ-బీఎస్పీలు నికరంగా ఐదు సీట్లు కోల్పోయినట్టు ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బెంగాల్లో కూడా ఇటువంటి పరిస్థితే. ప్రత్యామ్నాయం కనిపించిన చోట, గట్టిగా పోరాడిన చోట ప్రతిపక్షాన్నీ గెలిపించారు. సరైన ప్రత్యామ్నాయం అనిపిస్తే, మంచి జరుగుతుందని భావిస్తే గెలిపిస్తారు. సరైన ప్రత్యామ్నాయం అనిపించి నా, వ్యవహారసరళి నచ్చకపోయినా ఓడిస్తారు. అల్పాన్ని, అతిని, అనైక్యతను జనం మెచ్చరు. పంజాబ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మోదీ సునామీని తట్టుకొని నిలబడ్డాయి. బీజేపీ భావోద్వేగాల ధాటిని ఎదిరించిన మేరకు ప్రతిపక్షాలు గెలిచి నిలిచాయి. తెలంగాణలో ఆరు మాసాల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఘనవిజయం అందించిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో ఎందుకు కోతపెట్టారో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం కల్పించారు. బీజేపీ రెచ్చగొట్టిన భావోద్వేగ రాజకీయాలతోపాటు, ప్రభుత్వంపై అక్కడక్కడా తలెత్తిన అసంతృప్తి కూడా టీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించినట్టు విశ్లేషకుల అంచనా. బీజేపీ ఒకసారి వస్తే పాతుకుపోతుందని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. ఏ పార్టీ అయినా ప్రజల విశ్వాసం పొందినంతకాలమే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ అనుకోలేదు. ఆ ఓటమి శాశ్వతం కాదని ఆరుమాసాల్లోనే మళ్లీ రుజువైంది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 4 లోక్‌సభ స్థానాలను, 18 శాతం ఓట్లను బీజేపీ సంపాదించింది. 1999 వచ్చేసరికి చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని ఏడు సీట్లు గెల్చుకున్నది. 2004 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి అన్నిస్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అందుకే పాతుకుపోవడాలు, శాశ్వతా లేవీ ఉండవు. ఏ ప్రజా తీర్పూ శాశ్వతం కాదు. అంతిమమూ కాదు. నాయకులు, పార్టీలు, విధానాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా ప్రజల తీర్పే ఉన్నతం. ప్రజల విజ్ఞతే గొప్పది. ప్రజా తీర్పునకు వందనం. By Katta Shekhar Reddy Sir(Taken From Namasthe Telangana)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat