Home / ANDHRAPRADESH / కోడెల శివ ప్రసాదరావు కుమారుడు అరెస్టుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు

కోడెల శివ ప్రసాదరావు కుమారుడు అరెస్టుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు

ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ నేత కోడెల శివ ప్రసాదరావు కుమారుడు, డాక్టర్‌ కోడెల శివ రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ.. స్థానంలో కేఎస్టీ.. వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. విపక్ష నేత హోదా లో జగన్‌ కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. గుంటూరు జిల్లాలో కేబుల్‌ వ్యాపారం నిర్వహించిన శివ రామకృష్ణ.. పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయన పై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు గత (ఆదివారం) రాత్రి నుండి కోడెల శివరాం కి సంబంధించి హైదరాబాద్‌, గుంటూరు లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలిసులు సహా ఇడి అధికారులు కూడా ఉన్నారని సమాచారం. ఇదంతా కూడా కేబుల్‌ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం.. నిర్వహిస్తున్న సోదాలేనని, ఇందులో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని అంటున్నారు. శివరాం పై కేసులు పెట్టిన కంపెనీలు.. పైరసీ ద్వారా కేబుల్‌ కనెక్షన్‌ వ్యాపారం చేసి సుమారు రూ.70 కోట్లు కేబుల్‌ కంపెనీలకు ఎగ్గొట్టినట్లు కోర్టు కి ఆధారాలు సమర్పించాయి. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.. భారత దేశ చరిత్ర లో ఇంత భారీ స్థాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్‌ పైరసీ కేసు ఇదే.. అని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీనితో కోర్టు ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు అణువణువును గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లి పోలీసులు కోడెల శివరామకృష్ణ ను ఏ క్షణాన్నైనా అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏదేమైనా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన విచ్చలవిడి దోపిడీ కి ఇప్పుడైనా అడ్డుకట్ట పడుతోందని వ్యాపారులు ఆనందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat