Home / 18+ / జగన్ రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం…..పట్టుదల ఉంటే పట్టాభిషేకం..

జగన్ రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం…..పట్టుదల ఉంటే పట్టాభిషేకం..

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనే నేను ఈ రాష్ర్ట ముఖ్య‌మంత్రిగా…. అనే ప‌దాల‌ను అఖిలాంధ్రుల స‌మ‌క్షంలో ప‌లికేందుకు  వైఎస్ జ‌గ‌న్ శ్వాసించాడు. స్వ‌ప్నించాడు. ప‌రిత‌పించాడు. అదే ల‌క్ష్య‌మై ముందుకుసాగాడు. దీక్ష‌లా, య‌జ్ఞంలా సాగిపోతే ఏ నాటికికైనా, ఎంత‌టి ల‌క్ష్య‌మైనా ఒడి చేరుతుంద‌ని నిరూపించి పలువురికి ఆద‌ర్శంగా నిలిచాడు…. జ‌గ‌న్‌…ఈ రోజు జ‌రిగింది అత‌డి ప‌ట్టుద‌ల‌కు ప‌ట్టాభిషేకం..

నా అనే వాళ్లు, నా అనే వ్య‌వ‌స్థ‌లు అన్నీ అత‌డిని వెలేశాయి. చిన్న‌గా అత‌డే వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్మించుకోవ‌డం మొద‌లుపెట్టాడు. అత‌డే నాయ‌కుల‌ను త‌యారుచేయ‌డం మొద‌లుపెట్టాడు. ఆటుపోట్లు, ఎదురుదెబ్బ‌ల‌కు ఎదురు నిల‌బ‌డ్డాడు. చివ‌రికి విజ‌యం సాధించాడు. అత‌డిని వెలేసిన మ‌నుషులు, వ్య‌వ‌స్థ‌లన్నీ ఇప్పుడు అత‌డిని కీర్తిస్తున్నాయి. అత‌డి క‌ర‌చాల‌నం కోసం, అత‌డి ఆలింగ‌నం కోసం అర్రులు చాస్తున్నాయి. విజ‌యం అంటే ఇది. మ‌న‌ల్ని చిన్న‌చూపు చూసిన వాళ్లు మ‌న వ‌ద్ద‌కు ప‌రుగులు పెట్ట‌డం అస‌లైన విజ‌యం. జ‌గ‌న్ అది సాధించాడు. స‌గ‌ర్వంగా విజేత‌గా త‌లెత్తి నిల‌బ‌డ్డాడు. త‌న‌ను దుర్భాష‌లాడిన నోళ్ల‌ను, వెక్కిరించిన నొస‌ళ్ల‌ను, ఘ‌ర్ష‌ణ‌గా చూసిన క‌ళ్ల‌ను.. ఇలా అన్నింటిని ఇప్పుడు త‌న ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

కృషి, ప‌ట్టుద‌ల‌, ధైర్యం ఉంటే ల‌క్ష్యం ఎంత పెద్ద‌ద‌యినా ద‌రి చేరుతుంద‌ని నిరూపించిన వ్యక్తి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ….తండ్రి మరణానంతరం కొన్ని పరిస్థితుల వల్ల  తాను సొంతంగా పార్టీ పెట్టుకోవాల్సి వ‌చ్చింది. దీన్ని ధిక్కారంగా భావించిన హ‌స్తిన సేన  దాడికి దిగింది. ఇంకొక‌డైతే  ఢిల్లీ పీఠానికి త‌ల‌వంచి స‌లాం కొట్టేవాడే..కానీ అత‌డు జ‌గ‌న్‌…. రోజుకో సీబీఐ కేసు, పూట‌కో చోట ఈడీ దాడులు, గంట‌కో భ‌య‌పెట్టే వార్త‌, వారానికొక చార్జిషీటు, విచార‌ణ‌లు, కోర్టులు, అరెస్టులు, 18 నెల‌ల‌పాటు జైలులోనే నిర్బంధ‌నం, మీడియా ఉగ్ర‌రూపం…వీట‌న్నింటినీ జ‌గ‌న్ భ‌రించాడు. దిగ‌మింగాడు. చిన్న‌క‌ష్టానికే ఆత్మహత్య ల వైపు  వెళుతున్న  నేటి యువ‌త జ‌గ‌న్ పోరాటాన్ని క‌చ్చితంగా చ‌ద‌వాల్సిందే. క‌ష్టాన్ని బ‌య‌ట‌కు క‌నిపించ‌నీయ‌ని అత‌డి నైజం, పెనుస‌వాళ్లు ముసురుకున్నా చెర‌గ‌ని అత‌డి చిరున‌వ్వు, ఏనాడూ, ఎవ‌డికీ త‌లొగ్గ‌ని తెగువ‌.. ఇవ‌న్నీ ఎప్ప‌టికీ అంద‌రికీ ఆదర్శ‌నీయ అంశాలే.

కాంగ్రెస్‌పార్టీ వైఎస్ జ‌గ‌న్‌కు భ‌విష్య‌త్తు లేకుండా చేయాల‌ని భావించింది. అందుకోసం ఢిల్లీ స్థాయిలో చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. చివ‌రికి ఏమైంది.? నేడు  కాంగ్రెస్‌పార్టీ నేల‌మ‌ట్ట‌మైంది…. జ‌గ‌న్‌ను అస‌లు ప్ర‌తిప‌క్ష‌నాయకుడిగా చూడ‌టానికి తెలుగుదేశం పార్టీ ఇష్ట‌ప‌డ‌లేదు. ఇప్పుడేమైంది. ఆ ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌డానికి కూడా టీడీపీ నానా తంటాలు ప‌డింది. అంత‌కంత‌కూ ఎదుగుతూ వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్ పై హత్యాయ‌త్నం జ‌రిగిన రోజు సైతం అతడి మొఖం లో క‌నిపించింది చిరున‌వ్వే త‌ప్ప భ‌యం కాదు.

జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎవ‌రికీ త‌ల‌వంచ‌కుండా, ఓర్పుగా, ధైర్యంతో, ప‌ట్టుద‌ల‌తో, దీక్ష‌తో, పౌరుషంతో, వీర‌త్వంతో, ప్ర‌జ్ఞ‌తో, విజ్ఞ‌త‌తో, విన‌యంతో, త‌ప‌న‌తో, కృషితో, క‌ష్టంతో, శ్ర‌మ‌తో, నిరాడంబ‌ర‌త్వంతో, నిష్ట‌తో, నిర్మ‌లంతో, జ‌న‌కుడి ఆశిస్సుల‌తో, న‌వ్వుతో, చిరున‌వ్వుతో, తెగువ‌తో, సాహ‌సంతో, తెలివితో, చురుకుతో, నేర్పుతో, ప్ర‌తిభ‌తో, స్వీయ‌ స‌త్తాతో….విజయం దిశగా వెళ్ళాడు  గెలుపు ఆయ‌న‌కు మంచి మార్కులే వేసింది. డిస్టెన్ష‌న్‌లో పాస‌య్యేలా చేసింది.

వైఎస్ జ‌గ‌న్ జీవితం నేటి యువ‌త‌కు ఓ మంచి పాఠం. క‌ష్టాలు, క‌న్నీళ్లు వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోకుండా పోరాడితే గెలుపు దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పేందుకు అత‌డి జీవితం నిద‌ర్శ‌నం. ఏపీ ముఖ్య‌మంత్రి అనే త‌న క‌లను సాకారం చేసుకున్నందుకు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాను..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat