Home / ANDHRAPRADESH / రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!

రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!

ఆర్కే రోజా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్. గత ఐదేళ్ళుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ ను ఇంట బయట చెడుగుడు ఆడుకున్న రాజకీయ నేత.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుకి “పప్పు”అనే బిరుదునిచ్చి యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా లోకేశ్ నాయుడు ముద్దపప్పు అని ప్రూవ్ చేసిన మహిళా నాయకురాలు. వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు. అంతకుమించి వైసీపీ అధినేత,ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన నాయకురాలు.

తోబుట్టువుగా భావించే నగరి ఎమ్మెల్యే. అయితే ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్లో ఆర్కే రోజాకు ఖచ్చితంగా చోటు దక్కుతుందని అందరూ భావించారు.అఖరికీ మంత్రులు ప్రమాణస్వీకార సమయం వరకు ఆమెను అందుబాటులో ఉండమని సీఎం జగన్ ఆర్కే రోజాకు ఆదేశాలిచ్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు చివరి క్షణంలో మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దీంతో అవాక్కవడం వైసీపీ శ్రేణులు.రోజా అభిమానుల వంతైంది. అయితే జగన్ ఎంతగానో అభిమానించి.. తనకు కష్టకాలంలో అండగా ఉన్న మహిళా నాయకురాల్లో ప్రధమ స్థానంలో ఉండే రోజాకు ఎందుకు మంత్రి వర్గంలో చోటివ్వలేదో అని అందరూ తమతమకు తోచినట్లుగా విశ్లేషణలు చేస్తోన్నారు.

కానీ జగన్ ఆర్కేరోజాకు మంత్రి పదవీ ఇవ్వకపోవడానికి బలమైన కారణమే ఉంది. అదేమిటంటే సీఎంగా జగన్ తన మంత్రి వర్గంలో సామాజిక న్యాయమనే సూత్రాన్ని పాటించాడు. అంతేకాకుండా సీనియార్టీకి జూనియర్లకు సమన్యాయం చేశారు. కానీ రోజాకు మంత్రి పదవీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రోజా ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లా చిత్తూరు. ఇదే జిల్లా నుండి అత్యంత సీనియర్ ఎమ్మెల్యే,నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉండటం. ఆయన రోజా సామాజిక వర్గానికి చెందడంతో జగన్ ఆర్కేరోజాను కాదని పెద్దిరెడ్డికిచ్చారు. అంతకుముందే రోజాతో మాట్లాడిన సీఎం జగన్ రెండున్నరేళ్లు కళ్ళు మూసుకుని తెరిచేలోపు గడిచిపోతాయి. ఆ తర్వాత విస్తరించబోయే మంత్రి వర్గంలో చోటిస్తాను. ఇప్పటికైతే క్యాబినెట్ హోదా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఛైర్ పర్షన్ గా అవకాశమిస్తానని హామీచ్చాడు.దీంతో జగన్ మీద నమ్మకంతో సరే అనడం రోజా వంతైంది. ఇది అన్నమాట అసలు ముచ్చట రోజాకు బెర్తు ఖరారు కాకపోవడం వెనకున్న అసలు కారణం..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat