Home / ANDHRAPRADESH / జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!

జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది.

తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 11.05గంటలకు జాతీయ గీతంతో ప్రారంభమైన నూతన అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరిస్తోన్న ” శంబంగి చిన వెంకట అప్పలనాయుడు “సభాపతి స్థానంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలచేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే కొత్తగా కొలువు దీరిన నూతన అసెంబ్లీ ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దామా..?

నూతనంగా కొలువు దీరిన ఈ అసెంబ్లీలో జాతీయ పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మొత్తం 175మంది ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం కొత్తవారు కావడం గమనార్హం.. అంతే కాకుండా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఇరవై ఐదుమందిలో పంతొమ్మిది మంది కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ,సీపీఐ,సీపీఎం తదితర పార్టీలకు ప్రాతినిధ్యం లేదు మరో విశేషం. పోలైన ఓట్లల్లో యాబై శాతం ఓట్లు,మొత్తం 175స్థానాల్లో 86% సీట్లు ఒకే పార్టీ గెలుపొందడం ఈ నూతన అసెంబ్లీ ప్రత్యేకతలు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat