Home / 18+ / గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !

గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !

యావత్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్‌, గల్లంతైన విషయంపై సిట్‌ చేపట్టిన దర్యాప్తు కేబినెట్‌ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్‌ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని చూసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అప్పటి విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు దీంతో సంబంధాలున్నాయట.. కానీ మాజీమంత్రి గంటాకు విశాఖ భూకుంభకోణంతో సంబంధం లేదని చంద్రబాబు కేబినెట్‌ నిర్ణయించింది.

గంటాకు క్లీన్‌చిట్‌ ఇవ్వడానికే కేబినెట్‌ సమావేశం దీన్ని చర్చకు స్వీకరించిందని విపక్షం కూడా ఆరోపించింది. గతంలో ఇచ్చిన సిట్‌ నివేదికను కేబినెట్‌ ఆమోదించడంతో విషయం ‘క్లీన్‌’ అయిపోయినట్లేనని భావిస్తున్న గంటా వర్గం గుండెల్లో రైళ్లు పరుగెడుగున్నాయని తాజా ఘటనల నేపధ్యంలో స్పష్టమవుతోంది. పలువురు టీడీపీ నేతల ఈకుంభకోణంలో ఉండడం.. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండడంతో సిట్‌ నివేదికలో వీరెవరినీ దోషులుగా పరిగణించలేదు. కేవలం రెవెన్యూ అధికారులనే బాధ్యులుగా నిర్ధారించారు. కానీ ప్రతిపక్ష నేత హోదాలో విశాఖకు వచ్చిన జగన్ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం లో అభివృద్ధిమాట దేవుడెరుగు ఎక్కడ భూమికనిపించినా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో ఆయన మాట్లాడారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు భూములు దోచేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు ఎక్కడా కనిపించడం లేదని, ఎక్కడైనా కనిపిస్తే మాయం చేస్తున్నారని మండిపడ్డారు.

గంటా చంద్రబాబు ట్రైనింగ్‌లో ఆరితేరిపోయాడని, ఎన్నికలు వచ్చేప్పటికి దొంగల ముఠా స్థావరాలు మార్చినట్లు గంటా తన నియోజకవర్గాలను మారుస్తాడంటూ జగన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గంటా భీమిలినుంచి పోటీ చెయ్యరంటూ జగన్ అభిప్రాయడ్డారు. చివరికి అదే జరిగింది. అలాగే గతంలో మంత్రి అయ్యన్నపాత్రుడే సీఎం చంద్రబాబుకి లేఖ రాసారు. విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపిస్తే ఎవరి ప్రమేయం ఎంతుందో తెలిసిపోంతుందన్నారు. గంటా పాత్ర ఉందని ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో వెల్లడించారు. అయితే తాజాగా వచ్చిన జగన్ ప్రభుత్వం విశాఖలో కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతం అయిన ఘటనపై విచారణ జరిపి, విన్యూ రికార్డులు టాంపరింగ్ జరిగిన విధానాలను పరిశీలించి నిందితులకు చట్టం ద్వారా శిక్షించే అవకావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat