Home / SLIDER / గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.

గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.

తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 15 గురుకులాలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, టి. రాజాసింగ్, మాగంటి గోపీనాథ్ ,ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మన్సూరాబాద్‌లోని కామినేని దవాఖాన వెనకాల గల ఎంఆర్‌ఆర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్, గోషామహల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించనున్నారు. ఇవే కాకుండా మరో 12 రెసిడెన్షియల్ హాస్టళ్లను సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, బీసీ సంక్షేమశాఖ అధికారులు ప్రారంభించబోతున్నారు.  మేడ్చల్‌లో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు పడుతున్నాయి.

See Also : పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ గురుకుల పాఠశాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ)లను ఏర్పాటు చేస్తూ భావితరాలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 5-8 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలుండగా, తాజాగా రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు నేడు ముహూర్తం ఖరారు చేశారు. మేడ్చల్ జిల్లాలో కూడా కొత్తగా ఐదు మహాత్మజ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలో మూడు బాలురకు, రెండు బాలికలకు కేటాయించారు. ఇందులో మేడ్చల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీసీ గురుకుల పాఠశాలలు బోగారంలోని తిరుమల ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నామని, వీటిని నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజు, జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డితో పాటు బీసీ గురుకుల, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజన్న, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు.

అలాగే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాయినందిన పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే బేతి శుభాష్ రెడ్డి ప్రారంభిస్తారని, బోగారంలోని వివేకానంద ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి బాలికల బీసీ గురుకుల పాఠశాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్ కలెక్టరేట్ సమీపంలోని హస్విత పాలిటెక్నిక్ కాలేజ్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించనున్నారు. మొత్తం ఐదు గురుకులాల్లో మూడు బాలురకు, 2 బాలికలకు మంజూరు చేయగా, తొలుత 5, 6, 7 తరగతులకు అడ్మిషన్లు ఇస్తున్నామని, ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకే అడ్మిషన్లు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఒక్కో తరగతిలో 80 మంది చొప్పున ఈ విద్యా సంవత్సరంలో 240 మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, సాద్యమైనంత త్వరగా శాశ్వత భవనాల్లోకి మార్చుతామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఐదు బీసీ గురుకుల పాఠశాలలుండగా, తాజాగా మరో ఐదు కొత్త గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తుండటంతో మొత్తం వీటి సంఖ్య 10కి చేరింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat