Home / SLIDER / చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు.