Home / SLIDER / ఫించ‌న్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్ల‌లో జ‌మ

ఫించ‌న్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్ల‌లో జ‌మ

తెలంగాణలో వనపర్తి పట్టణంలో పెరిగిన పించన్ల ఫ్రొసీడింగ్స్ ను మంత్రి నిరంజన్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ‌లో పేదరికం ఉన్నంత‌కాలం ప్ర‌భుత్వం పెన్ష‌న్లు అంద‌జేస్తుందన్నారు.
 
తెలంగాణ‌లో ఉన్న అన్నిర‌కాల వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకుంటే ప‌దేళ్ల‌లో దేశంలోనే గొప్ప‌ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఆ దిశ‌గానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనేక అభివృద్ది ప‌నుల‌తో పాటు, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌న్నారు. పెరిగిన ఫించ‌న్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్ల‌లో జ‌మ అవుతాయ‌న్నారు. తొమ్మిది ఎక‌రాల‌లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నట్లు తెలిపారు.
 
డ‌బ‌ల్ బెడ్ రూం ఇండ్ల ల‌బ్దిదారుల విష‌యంలో రాజ‌కీయ జోక్యం ఉండ‌దన్నారు. ప్ర‌భుత్వ అధికారులే స‌ర్వే నిర్వ‌హించి ఇండ్లు లేనివారిని గుర్తిస్తారన్నారు. బ‌హిరంగంగా లాట‌రీ ప‌ద్ద‌తిన ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేస్తారన్నారు. ఇండ్లు లేని ప్ర‌తి పేద‌వారికి న్యాయం జ‌రిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సొంత జాగా ఉన్న‌వారికి అక్క‌డే ఇండ్లు క‌ట్టుకునేందుకు త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వుల విడుద‌ల‌ చేస్తామన్నారు. సమాజంలో ఆకలిగొన్న వర్గాలున్నయి ఆలోచించండి. బంతిల ఉన్నరు మీ వంతు వస్తుంది. అభివృద్ది పనులు జరుగుతున్నయి ఓపికపట్టండని మంత్రి పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat