ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో ఏడుగురి కండరాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు,మారుతున్న జీవన శైలి,ప్రోటీన్లు సమృద్ధిగా తీసుకోకపోవడం.. సరైన వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఈ సర్వేలో తేలింది. అయితే దేశ వ్యాప్తంగా పలు సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నవారిపై డనోన్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది.