రానా దగ్గుబాటి..ఇతడి పేరు వింటే ఎవరికైనా గుర్తొచ్చేది బల్లాలదేవ. బాహుబలి సినిమాతో అంతటి ఫేమ్ తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో ఒక భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో రానుంది. అయితే విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. దీనికి గాను రానా నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ నే ఉంటుందని అంచనా. ఇప్పటివరకు రానా చిన్న చిత్రాలనే నిర్మించగా మొదటిసారి భారీ బడ్జెట్ పెట్టనున్నాడు. ఈ బయోపిక్ కి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు.
Tags biopic ms sripathi muralidaran production rana daggubati spinner srilanka vijay sethupathi