Home / 18+ / కామ్రేడ్‌ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న టీం.. ట్విట్టర్ లో హింట్ ఇచ్చిన రష్మిక

కామ్రేడ్‌ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న టీం.. ట్విట్టర్ లో హింట్ ఇచ్చిన రష్మిక

తాజాగా విజయ్‌ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్‌ కామ్రేడ్‌ గత శుక్రవారం విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు డివైడ్‌ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దు బాటు చర్యలు మొదలు పెట్టారు. సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి రీ ఎడిట్ చేసే పనిలో పడ్డారట.. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీవచ్చింది. ‘డియర్‌ కామ్రేడ్‌ టీం మీకు థియేటర్లో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీసూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకుమించి నేనేం చెప్పలేను’ అంటూ ట్వీట్ చేశారు రష్మిక. ఈ నెల26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి మూడురోజులు సెలవులు కావటంతో మంచి వసూళ్లు సాధించింది. సోమవారం కూడా తెలంగాణలో బోనాలు సెలవు ఉండటంతో ఇక్కడ మంచి కలెక్షన్లు వచ్చినా ఆంధ్రాలో వసూళ్లు దారుణంగా పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈపరిస్థితిలో చిత్ర యూనిట్ చేసిన మార్పులు సినిమాను ఎంత వరకూ కాపాడతాయో చూడాలి. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat