Home / SLIDER / మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా

మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా

తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు.
 
ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈద్గా మైదానం గతంలో తమ హయంలో తీర్చిదిద్దామని తెలిపారు. అనుబందంగా మదర్స, ఇతర ప్రాంగణాల నిర్మాణం కోసం గతంలోనే రూ.6.25 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపారు. దశల వారీగా అన్ని పనులను చేపడతామని తెలిపారు.
 
బక్రీద్ సందర్భంగా పలు సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో టెలిఫోన్ ద్వారా సంప్రదించారు. శేశాపహాడ్ ముస్లిం స్మశాన వాటికను (ఖబరస్థాన్) కూడా పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సందర్శించారు. corporator విజయకుమారి, ghmc ఉప కమీషనర్ రవి కుమార్, ఈ ఈ ప్రమోద్ కుమార్, de పరమేష్ , జల మండలి, transco అధికారులతో పాటు మైనారిటీ నేతలు, పలుఫురు స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.,

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat