Home / NATIONAL / కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు

కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు

గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం   దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ఎయిమ్స్ లో  చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో   బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు.సుష్మా మృతితో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో,ఆ మె అభిమానుల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా ,రాజ్యసభ ఎంపీగా,ముఖ్యమంత్రి,కేంద్రమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా..!

పేరు : సుష్మా స్వరాజ్
జననం: ఫిబ్రవరి 14,1952
తల్లిదండ్రులు: హరిదేవ్ శర్మ,లక్ష్మీదేవి
జన్మస్థలం: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్
విద్యార్హతలు: రాజనీతి శాస్త్రం,సంస్కృతంలో బీఏ,న్యాయశాస్త్రంలో పట్టా(పంజాబ్ విశ్వవిద్యాలయం)
కుటుంబం:
1973లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పరిచయమైన స్వరాజ్ కౌశల్ తో వివాహాం.. వీరికి ఒక కుమార్తె.. కుమార్తె పేరు బన్సూరి స్వరాజ్
రాజకీయం ఆరంగేట్రం:
1970లో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశారు
1977-82లో బీజేపీ తరపున అంబాలా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక
అతిచిన్న వయస్సు 25ఏండ్లలోనే మహిళా ఎమ్మెల్యేగా ,మంత్రిగా సుష్మా రికార్డు
దేవిలాల్ సారధ్యంలో జనతాపార్టీ మంత్రివర్గంలో పనిచేశారు
1987-90మధ్య రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
1990లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక
1996లో దక్షిణ ఢిల్లీ నుండి లోక్ సభకు ఎన్నిక
1998 వరకు వాజ్ పేయి నాయకత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు
ఆ తర్వాత కేంద్రమంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు
2000లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక
2003దాకా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు
2003-04లో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు
2009లో మధ్యప్రదేశ్ లో విదిశ నుండి 4లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి లోక్ సభ పక్షనేతగా ఎన్నిక
2014వరకు లోక్ సభ పక్షనేతగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఏకైక బీజేపీ మహిళా నేతగా పేరు
2014లో మరల విదిశ నుండి ఎంపీగా గెలుపు
ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు
బీజేపీ తరపున అధికార ప్రతినిధిగా ఎన్నికైన తొలిమహిళా నేత సుష్మా
మొత్తం ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుష్మా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat