Home / NATIONAL / ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!

ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!

ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు సుష్మా.. ఈ సందర్భంగా సుష్మా రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందామా..!

-1977-82: హర్యానా శాసన సభకు తొలిసారి ఎన్నిక
-1977-79: హర్యానా ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి మంత్రిగా బాధ్యతలు
-1987-90: హర్యానా శాసనసభ సభ్యురాలిగా రెండోసారి ఎన్నిక
-1987-90: విద్య, ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు
-1990-96: రాజ్యసభకు తొలిసారి ఎన్నిక
-1996-97: 11వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా రెండోసారి: 1996 మే 15- 1997 డిసెంబర్4)
-1996: (మే 16 – జూన్ 1) కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు
-1998-99: 12వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా మూడోసారి: 1998 మార్చి 10- 1999 ఏప్రిల్ 26)
-1998: (మార్చి 19- అక్టోబర్ 12) కేంద్ర సమాచార, ప్రసారశాఖతోపాటు అదనంగా టెలీకమ్యూనికేషన్ల శాఖ బాధ్యతలు
-1998: (అక్టోబర్ 13- డిసెంబర్ 3) ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి
-1998: (నవంబర్) హజ్ ఖాస్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక. అనంతరం రాజీనామా. లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగింపు
-2000-06: రాజసభ్యకు ఎన్నిక (ఎంపీగా నాలుగోసారి)
-2000-03: (2000 సెప్టెంబర్ 30- 2003 జనవరి 29) కేంద్ర సమాచార, ప్రసారశాఖ బాధ్యతలు
-2003-04: (2003 జనవరి 29- 2004 మే 22) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు
-2006-09: (2006 ఏప్రిల్) రాజ్యసభకు ఎన్నిక (ఎంపీగా ఐదోసారి)
-2009-14: (2009 మే 16- 2014 మే 18) 15వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా ఆరోసారి)
-2009-09: ( 2009 జూన్ 3 – 2009 డిసెంబర్ 21) లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నేత
-2009-14: (2009 డిసెంబర్ 21- 2014 మే 18) లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అద్వానీ స్థానం భర్తీ
-2014-19: (2014 మే 26 నుంచి ) 16వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా ఏడోసారి)
-2014-19: (2014 మే 26- 2019 మే 29) కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat