Home / festival / మేడారం సమ్మక్క-సారక్క జాతర పై రివ్యూ మీటింగ్

మేడారం సమ్మక్క-సారక్క జాతర పై రివ్యూ మీటింగ్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేది నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే జన జాతరను కుంభమేళను తలపించే విధాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూఈ జాతరకు ఎంతో మహోన్నత చరిత్ర కలిగి, రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ. ఈ జాతరకు భారతదేశం నలుమూలల నుండి కోట్లమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ జాతర ప్రకృతి నే దైవంగా భావించి పూజించడం జరుగుతుంది.
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ జాతర ను అంబరాన్నంటే విధంగా సంబరాలను నిర్వహించాలని ఆదేశించటం జరిగింది.మేడారం చుట్టు ఉన్న కొండా కోన పరవశించే విధాలుగా జాతీయ స్థాయిలో ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దేశం నుండి వచ్చే కోట్లాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగని రీతిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం లో వివిధ ప్రాంతాల నుండి కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేందుకు వీలుగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వేలాది బస్సులను నడపబోతున్నాము. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఇంతటి జాతర పట్లా వివక్ష చూపించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ జాతర ను జాతీయ పండుగగా గుర్తించే విధంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అలాగే ఈ జాతులకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోందని మంత్రి గారు వివరించారు. అలాగే మేడారం జాతర దారులను విస్తరించాలని, రోడ్డు భవనాల శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ జాతర కు లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి వైద్య సదుపాయాలను, చుట్టూ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పెద్ద ఎత్తున ఈ జాతర ను నిర్వహించేందుకు అవసరమైన నిధులను గిరిజన సంక్షేమ శాఖ నుండి కేటాయించడం జరుగుతుందని సంక్షేమ శాఖ మంత్రి గారు పేర్కొన్నారు* ఈ సమావేశం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు గారి అధ్యక్షతనలో నిర్వహించడం జరిగింది. ఈరోజు సమావేశం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్నారు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat