Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌ స్పీచ్‌కు యూత్ ఫిదా… This is వెరీ దారుణం..బాబుగారు…!

సీఎం జగన్‌ స్పీచ్‌కు యూత్ ఫిదా… This is వెరీ దారుణం..బాబుగారు…!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుగారి ఆంగ్ల భాషా ప్రావీణ్యం గురించి తెలుగు ప్రజలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు..ఓటుకు నోటు కేసులో బాబుగారు వదిలని “మా వాళ్లు బ్రీఫ్డ్‌మి ” డైలాగ్ తెలుగు ప్రజలను ఎంతగా నవ్వించిందో తెలుసు. ఇక ” No NO What i am saying is, Modi gave ముంత మట్టి, చెంబు నీళ్లు, Is it not వివక్షత, This is దారుణం, There is no చట్టం లాంటి దిక్కుమాలిన ఇంగ్లీష్ మాట్లాడే..నాయకుడు దేశంలోనే ఎక్కడా ఉండరు. తాజాగా ఏపీ సీఎం ఇంగ్లీష్ స్పీచ్ విన్న యూత్ ఫిదా అయిపోయారు. ఆగష్టు 9 వ తారీఖు శుక్రవారం విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ కు వచ్చిన 30కి పైగా దేశాల రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్‌ జనరల్స్‌తో జరిగిన సమావేశంలో “ఏపీలో పెట్టుబడులు పెట్టమని మీ దేశాలకు, అక్కడి పారిశ్రామిక వేత్తలకు చెప్పండి” అంటూ సూటిగా వాస్తవాలు చెబుతూ ‘చక్కటి ఇంగ్లీష్‌లో సాగిన జగన్ ప్రసంగం’ యూత్‌ను బాగా ఆకర్షించింది అని ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఎక్కడా సోత్కర్ష లేకుండా, సుత్తి కొట్టకుండా, సూటిగా, స్పష్టంగా, సాగిన జగన్ ఇంగ్లీష్ స్పీచ్ వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పాటు, ఏపీ యువతను ఆకట్టుకుంది. 972 కిలో మీటర్ల పొడవైన కోస్తా తీరం , 4 సీ పోర్ట్ లు 6 ఎయిర్ పోర్ట్ లు , సమృద్ధిగా నీరు, తక్కువ ధరకే విద్యుత్తు , ముఖ్యంగా అవినీతి లేకుండా లైసెన్సులు ఇస్తామని సీఎం జగన్ సాధికారికంగా చెప్పడంతో విదేశీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు జపాన్‌కు చెందిన మాకీ సంస్థ వారు బాబు జమానా అంతా అవినీతి, ఇక్కడ క్రింది నుంచి పైదాక లంచం ఇవ్వనిదే పని జరగదు అని లేఖ రాసిన సంగతి తెలిసిందే. “మా వాళ్లు బ్రీఫ్డ్‌మి, వాట్ ఐ యామ్ సేయింగ్, దిసీజ్ వెరీ దారుణం” లాంటి దిక్కు మాలిన తింగ్లీష్ మాట్లాడే తింగరి బాబు ఎక్కడ, ఇంగ్లీష్ ఫ్లూయంట్‌గా మాట్లాడే జగన్ ఎక్కడ అని ఏపీ యువత బాబు, జగన్ స్పీచ్‌లను కంపేర్ చేస్తున్నారు. ఇక జగన్ సీఎం కాగానే దాదాపు 5 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ఇవ్వడంతో యూత్‌‌ను ఆకట్టుకుంది. సీనియారిటీయా సింత కాయా…అనుభవమా వంకాయా…విజానా.. విస్తరాకుల కట్టా…అంటూ ఏపీ యూత్ ఓ రేంజ్‌లో బాబుగారిని చెడుగుడు ఆడేసుకుంటున్నారు. బాబు అను కుల మీడియాలో ఇదివరకు జగన్ మీద జరిగిన దుష్ప్రచారం , గ్రామర్ మిస్టేక్ లేకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేని బాబును ప్రపంచ మేధావి అని జాకీలు పెట్టి లేపిన విధం పోల్చుకొని ముక్కున వేలేసుకొంటున్నారు యూత్. మొత్తానికి ఇంగ్లీష్ స్పీచ్‌లో జగన్ ముందు బాబుగారు ఏమాత్రం పనికి రారని తేలిపోయింది. వాట్ ఐ యామ్ సేయింగ్ బాబుగారు…This is నిజమే కదా అని నెట్‌జన్లు ఫుల్లుగా సెటైర్లు వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat