Home / ANDHRAPRADESH / రాజులు మంచివాళ్లు అయితే రాజ్యాలు సుభిక్షం..!

రాజులు మంచివాళ్లు అయితే రాజ్యాలు సుభిక్షం..!

పాలించే రాజులు ప్రజా క్షేమాన్నికాంక్షించే సుపరిపాలకులు అయితే…ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి అనే నానుడికి తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే అర్థమవుతుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ఎన్నేళ్లయింది… నాగార్జుసాగర్ గేట్లు తెరుస్తమని ఏనాడైనా అనుకున్నమా…..ముఖ్యంగా తెలంగాణలో కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే చూసి మురిసి ఎన్నేళ్లు అయింది…జీవనది లాంటి కృష్ణమ్మ జాడ లేక…తెలుగు రాష్ట్రాలు ఎంతగా విలవిలలాడిపోయాయి. కానీ ఈసారి గోదావరి గంగమ్మ గలగలా పారుతుంటే…కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. గత కొన్నేళ్లుగా ప్రకృతి మాత కరుణించలేదు..తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గలగలా పారే గోదావరి నీళ్లు లేక గోసపడింది. కృష్ణమ్మ నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకుంది. తుళ్లిపడే తుంగభద్ర తల్లిడిల్లిపోయింది. జలం లేక ప్రాణహిత నిర్జీవం అయింది. ఇలా…ఎక్కడ చూసినా దుర్భిక్షం తాండవించింది. కానీ..అదేంటో పాలకులు మంచి వాళ్లు, ప్రజాహితం కోరుకునేవాళ్లు అయితే ప్రకృతి కూడా హర్షిస్తుంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ఉన్నప్పుడు వరుణదేవుడు ఎప్పుడూ ఆయనవెంటే ఉండేవాడు…వర్షాలు బాగా కురిసేవి…పంటలు బాగా పండేవి…రైతన్నలు దర్జాగా బతికేవారు. రాష్ట్రమంతటా సుభిక్షంగా ఉండేది. అందుకే వైయస్ తరచుగా అనేవారు..వరుణదేవుడు ఎప్పుడూ మా వెంటే ఉండేవాడని…దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే…ప్రజల క్షేమం గురించి ఆలోచించే పాలకులకు ప్రకృతి కూడా సహకరిస్తుందని…రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని.

అదేమి విచిత్రమో కానీ…చంద్రబాబు పాలనలో ఉన్న సమయంలో మాత్రం ప్రకృతి మాత ఆగ్రహించేది. బాబు పాలనలో ఉన్నప్పుడల్లా అయితే తీవ్రమైన కరువు కాటకాలు.. లేకుంటే వరదలు, తుఫాన్లు…అంతా సర్వనాశనం. అవును…ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బాబు పాలనలో ఉన్నప్పడల్లా రాష్ట్రాన్ని అనావృష్టి లేకుంటే అతివృష్టి పట్టిపీడించేది. రైతన్న బతుకు అంధకారంగా ఉండేది. ఎక్కడ చూసినా దుర్బిక్షంగా ఉండేది. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ తన స్వప్రయోజనాలు, తన కులం, తన వర్గం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారు కానీ…ఏనాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదు. అందుకేనేమో ఆయన పాలనలో ప్రకృతి కరుణించకపోయేది. అంతెందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన గత ఐదేళ్లు నవ్యాంధ్రప్రదేశ్‌లో క్షామమే రాజ్యమేలేంది. ఏ సంవత్సరం సరిగా వర్షాలు పడిన పరిస్థితి లేదు. మూడు పంటలు పడే అమరావతిలాంటి పచ్చని భూములను చంద్రబాబు రాజధాని పేరుతో ధ్వంసం చేశాడు. వ్యవసాయాన్ని, రైతన్నలను ఏనాడు పట్టించుకున్న పాపానా లేదు…బాబు వస్తే వచ్చిన వానలు కూడా వెనక్కి వెళతాయి అనే నానుడి ఉండేది. అందుకే బాబు వస్తే…కరువే అన్న భావన ఏపీ ప్రజల్లో బలంగా ఏర్పడింది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే…గత ఐదేళ్లలో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోయినా… తెలంగాణలో పడిన చెప్పుకోదగ్గ వర్షాలతో పాటు కేసీఆర్ పాలనలో చేపట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ప్రతి నిత్యం రైతు బాగుంటేనే…రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది..కేసీఆర్ ఆలోచన..అందుకే కోటి ఎకరాల మాగాణానికి నీళ్లు అందించే సాగునీటి యజ్ఞం చేపట్టారు కేసీఆర్. ఎగువ రాష్ట్రం మహారాష్ట్రతో సాగునీటి దౌత్యం నెరపి..గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ ముందు చూపుకు, రైతుల పట్ల ఆయన నిబద్దతకు నిదర్శనం..నేడు కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి దుంకుతన్న గోదావరి గంగ. కేసీఆర్ చేస్తున్న ఈ సాగునీటి యజ్ఞానికి ప్రకృతి మాత కూడా మురిసిపోయింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించింది. కాళేశ్వరం నిర్మాణం పూర్తి కాగానే…గోదావరి తల్లి మురిసిపోయింది. ఎగువ నుంచి కొండలు, కోనలు అడవులు దాటుకుంటూ..తొలుత ప్రాణహితకు ప్రాణం పోసి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎగువకు ప్రవహించి..ఎల్లంపల్లిలో కలిసి…శ్రీరాంసాగర్‌‌ను తాకి…..అటునుంచి మిడ్‌మానేరులో మునకేసి, అటు పిమ్మట..భద్రాద్రి రామయ్యను పలకరించి…సముద్రంలో కలిసేందుకు గోదావరి ఉరకలెత్తుతుంది. గత పదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా…ఈ సారి కృష్ణమ్మ కూడా జలకళతో ఉట్టిపడుతోంది. ఆల్మట్టిలో ఆడిపాడి అలసిసొలసి అక్కడ ఉండలేక.., నారాయణ్‌పూర్‌‌కు వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి..అటున్నుంచి… జూరాలలో జలాకాటాలు ఆడి… శ్రీశైలంలో సిందులేసి.. ఇప్పుడు నాగార్జునసాగర్‌కు బిరబిరా పరిగెడుతున్న కృష్ణమ్మను చూస్తుంటే…ఓహ్…ఎన్నాళ్లు అయిందమ్మా…నీ హోయలు..కులుకులు చూసి అని ఆనందంతో మనసు పరవశం అవుతోంది. ఇక తుంగభద్రమ్మ తుళ్లిపడుతుంటే…జర పయిలం తల్లి…మా బీడు భూములన్నీ ఓసారి తడిపి వెళ్లమ్మా అని అమ్మకు శరన్నార్తులు అంటూ మొక్కాలనిపిస్తుంది. అన్ని వాగులు, వంకలు, చెరువులు మత్తడి దుంకుతున్నయి. అందుకే పాలించే రాజు మంచివాడు అయితే ప్రకృతి కూడా సంతోషిస్తుంది…మంచి వర్షాలు కురిపించి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తుందని కేసీఆర్ పాలనలో రుజువైంది.

నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా వైయస్ కుమారుడు…జగన్ అధికారంలోకి వచ్చాకా…ప్రకృతి మాత కరుణించడం మొదలుపెట్టింది. ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురిసి…అన్ని ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత..పోలవరం దగ్గర గోదావరి తల్లి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ కళకళలాడుతోంది. అన్నీ బ్యారేజీలు, చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్…గత ఐదేళ్లలో రైతన్నకు పట్టెడు అన్నం పెట్టలేని దుస్థితిలో ఉండిపోయింది. మళ్లీ ప్రజల మంచి కోరే మంచి పాలకుడు జగన్ పాలనలో   నవ్యాంధ‌్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుందనడంలో సందేహం లేదు. వైయస్ జగన్ పాలనలో కోనసీమ బంగారు సీమ కానుంది..ఉత్తరాంధ‌్రకు ఊపిరి రానుంది. రాయలసీమ రతనాల సీమగా మారనుంది. అందుకే అంటారు..రాజులు మంచి వాళ్లు అయితే…రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని…అందుకే ఉదాహరణే..కేసీఆర్, జగన్‌ పాలనలో కురుస్తున్న వర్షాలు..నిండుకుండలా ప్రాజెక్టులు…మొత్తంగా కేసీఆర్, జగన్‌ల పాలనలో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా మారడం ఖాయం. రైతన్నలు రారాజులుగా దర్జాగా బతికే రోజులు ఖాయం..ఉజ్వల భవిష్యత్తు ముందుంది..జయహో కేసీఆర్…జయహో జగన్…!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat