Home / MOVIES / మెగా ఫ్యామిలీపై సంపూర్ణేష్ బాబు సంచలన వ్యాఖ్యలు…!

మెగా ఫ్యామిలీపై సంపూర్ణేష్ బాబు సంచలన వ్యాఖ్యలు…!

హృద‌య‌కాలేయం ఫేం స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ… కొబ్బరి మట్ట. లేట్‌గా వచ్చినా..లేటెస్ట్‌గా హిట్ కొట్టాడు సంపూ. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతూ…సంపూ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది…కొబ్బరి మట్ట. ఈ చిత్రంలో అండ్రాయుడిగా, పాపారాయుడిగా, పెదరాయుడిగా మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఫుల్ లెంగ్త్ కామెడీని పండించడంతో ఆడియన్స్‌ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా కొబ్బరిమట్ట మూవీ సక్సెస్‌పై సంపూ స్పందించారు. మా కష్టాన్ని ప్రేక్షక దేవుళ్లు అర్థం చేసుకున్నందుకు థాంక్స్. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ఆదరిస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు… అని సంపూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయనే నాగబాబు గారు. “సర్ మీరు మాకు సపోర్ట్ చేస్తూ పెట్టిన వీడియో వల్లే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది. మెగా ఫ్యామిలీ నుంచి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీకు నా పాదాభివందనం. మెగా అభిమానులకు, మెగా ఫ్యామిలీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ” సంపూ తెలిపారు. ” మొదటి నుంచి నాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మేము అడగ్గానే సాయి అన్న(సాయి ధరమ్ తేజ్) వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే మీరు ఇచ్చిన ధైర్యం మామూలు దైర్యం కాదు. మీ బ్లెస్సింగ్స్ మా లాంటి వారిపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను…” అని సంపూ చెప్పుకొచ్చారు.

రీసెంట్‌గా కొబ్బరి మట్ట మూవీ రిలీజ్ సందర్భంగా ‘‘హలో స్టీవెన్ శంకర్, సంపూర్ణేష్ బాబు… మీ కొబ్బరి మట్ట చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ట్రైలర్ చూసినపుడే చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే మిమ్మల్ని ఎందుకు అంత సపరేటుగా విష్ చేస్తున్నానంటే… మీరిద్దరూ మెగా అభిమానులు. మీరు మమ్మల్ని అంత అభిమానించినపుడు మీ సినిమా కూడా అంత బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్… మీ సినిమా మంచి విజయం అందుకోవాలి.” అంటూ ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. మొదటి నుంచి సంపూకు మెగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున విశాఖలో ప్రత్యేక హోదాపై విశాఖలో శాంతి ధర్నాకు పిలుపు ఇవ్వడంతో సంపూ స్వయంగా వైజాగ్ వెళ్లి యువత పోరాటానికి మద్దతు పలికాడు. గతంలో కూడా పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీకి సపోర్ట్‌గా మాట్లాడేవాడు సంపూ. ఆ అభిమానంతోనే నాగబాబు కొబ్బరిమట్ట మూవీ సక్సెస్ కావాలంటూ విష్ చేశాడు. దీంతో కొబ్బరిమట్ట మూవీ విజయంలో మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కూడా భాగమయ్యారు. కొబ్బరి మట్ట మూవీ ఊహించని విజయం అందుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్న సంపూ తన చిత్రానికి సపోర్ట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబుకు, మెగా ఫ్యాన్స్‌కు సంపూ థ్యాంక్స్ చెప్పి, మరోసారి మెగా ఫ్యామిలీ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat