Home / TELANGANA / ఎడిటోరియల్ : సిసలైన సాగునీటి దౌత్యవేత్త…కేసీఆర్…!

ఎడిటోరియల్ : సిసలైన సాగునీటి దౌత్యవేత్త…కేసీఆర్…!

ఏ ముఖ్యమంత్రి అయినా…తన రాష్ట్రం…తన ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు…దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటికంటే…తన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ కొందరు మాత్రమే..తన రాష్ట్రంతో పాటు..పక్క రాష్ట్రాలు, మొత్తంగా యావత్ దేశం బాగుండాలని కోరుకుంటారు. ప్రాంతీయ బేధం లేకుండా…అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు. అలాంటి కొద్ది మంది నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే..వలస పాలకుల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా…ఏ ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా స్వరాష్ట్రం కోసం కేసీఆర్ పోరాడాడో…ఇప్పుడు అదే ఆంధ్ర రాష్ట్రం బాగుకోసం ప్రయత్నం చేయడం…ఆహ్వానించదగిన పరిణామం.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ఒకటే మాట చెప్పేవారు. తెలంగాణను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తూ, దోపిడీ చేస్తున్న కొంత మంది ఆంధ్రా పెత్తందార్లపైనే తప్ప…ఆంధ్రా ప్రజలతో మాకు ఎన్నడూ పేచీ లేదు అని ఉద్యమ సమయంలో కేసీఆర్ స్పష్టంగా చెబుతూ ఉండేవారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్ణాల ప్రజలు ఏకమై తెలంగాణ సాధించుకున్నారు. స్వరాష్ట్రంలో తొలిపాలకుడిగా కేసీఆర్‌నే ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే…హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ ఉండదని, శాంతి భద్రతలు క్షీణిస్తాయని, సీమాంధ‌్ర ప్రజలపై దాడులు జరుగుతాయి…వ్యాపారాలు దెబ్బతింటాయంటూ పుకార్లు లేపారు. కానీ కేసీఆర్ పాలనలో సీమాంధ్రులు…ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎప్పటిలాగానే హైదరాబాద్‌లోని సెటిలర్లే కాదు…తెలంగాణ అంతటా అక్కడక్కడా స్థిరపడిన సీమాంధ‌్రులు తమ వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ప్రాంతాలు వేరైనా…తెలంగాణలో నివసించే వారంతా…తెలంగాణ బిడ్డలే అని కేసీఆర్ తరచుగా చెబుతుంటారు…చెప్పినట్లే అందరిని ప్రాంతీయ బేధం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు కూడా అందేలా చేస్తున్నారు.

అయితే తెలుగు ప్రజల దురదృష్టమో ఏమో కానీ…ఏపీలో గత ఐదేళ్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రాలు వేరైనా చంద్రబాబు మనసు మాత్రం హైదరాబాద్ మీదే..బంగారు బాతులాంటి హైదరాబాద్‌ను వదులుకోవడం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే రాష్ట్ర విభజన కాగానే..మళ్లీ తెలుగు రాష్ట్రాలను ఏకం చేస్తానంటూ…తెలంగాణపై విషం కక్కాడు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల మధ్య ఉన్న భాగోద్వేగాలను చల్చార్చే ప్రయత్నం చేసే బదులు..మరింతగా విద్వేషాలు రగిలించాడు చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. నీకు ఏసీబీ ఉంది..నాకు ఏసీబీ ఉంది..నీకు పోలీసులు ఉంటే…నాకు పోలీసులు ఉన్నారు..ఇది తెలుగు ప్రజల మీద జరుగుతున్న దాడి ..హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ లేదు…సెక్షన్ 8 అంటూ తన వ్యక్తిగత సమస్యను తెలుగు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం…తెలుగు ప్రజలకు చీకటి కాలం. తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రగిలించడంలో చంద్రబాబు చేయని కుట్రలేదు.

2018 లో కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలనకు మెచ్చిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఆయనకే పట్టం కట్టారు. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు అవినీతి, అరాచకపాలనకు విసిగిపోయిన ఏపీ ప్రజలు వైయస్ జగన్‌కు పట్టం కట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలన్న.. కేసీఆర్ పెద్దరికాన్ని గౌరవించిన జగన్…ఆయనతో గొడవల్లేకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తుండడంతో తెలుగు ప్రజల మధ్య మళ్లీ స్నేహబంధం వెల్లివిరుస్తోంది. అసలు ప్రాంతాలు వేరైనా, యాస భాషలు వేరైనా తెలుగు ప్రజల మధ్య విడదీయరాని భావోద్వేగ బంధం ఉంది. అలాంటి భావోద్వేగబంధాన్ని చంద్రబాబు తన రాజకీయ పబ్బం కోసం వాడుకున్నాడు. తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు రగిలించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాలకులు మంచి వాళ్లయితే..రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయనడానికి కేసీఆర్, జగన్‌లే సాక్ష్యం. అధికారంలోకి రాగానే మర్యాదపూర్వకంగా ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్ ను కలిశారు జగన్….తొలి సమావేశంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం దిశగా చర్చించడంతో ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతకు నాంది పలికింది.

కేసీఆర్‌ది లివ్ అండ్ లెట్ పాలసీ…మనం బతుకుదాం..ఎదుటివాళ్లను బతకనిద్దాం అనే పాలసీ. అందుకే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌‌ను కలిసి కూలంకుశంగా వివరించి, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా మహారాష్ట్ర నుంచి అన్ని అనుమతులు తీసుకుని…కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి..దాదాపు తెలంగాణలోని 14 జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో ఇలా దౌత్యం నెరిపి…నీటి ప్రాజెక్టులను నిర్మించిన దాఖలా లేదు. అందుకే కేసీఆర్ సాగునీటి దౌత్యవేత్తగా పేరుగాంచారు. అయితే తన రాష్ట్రమే కాదు…పక్క రాష్ట్రాలు కూడా బాగుండాలనే ధోరణి కేసీఆర్‌ది. తెలంగాణతో పాటు ఏపీకి కూడా గోదావరి నీళ్లే దిక్కు అని భావించిన కేసీఆర్..గోదావరి జలాలను వినియోగం చేయాలని నిర్ణయించారు. అందుకే గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించి నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లిలో పోసి, అటునుంచి శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, మల్లన్నసాగర్ తదితర ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీళ్లు అందించనున్నారు.

గోదావరి జలాలను కృష్ణమ్మకు అనుసంధానం చేయడం ద్వారా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నింపితే, ఏపీలోని కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ ఆలోచన. ఇదే విషయం ఏపీ సీఎం జగన్‌తో కూడా చర్చించారు. గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే…తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని కేసీఆర్ భావన. అందుకే ఒక్క తెలంగాణకే కాదు..ఏపీకి కూడా గోదావరి జలాలను తరలింపుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి ఒకే ఒక కారణం…కేసీఆర్ లివ్ అండ్ లెట్ పాలసీ. ఒక్క సాగునీటి రంగంలోనే కాదు..అన్ని రంగాల్లో ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకేనే ధోరణిలో సహకరించుకోవాలన్నదే కేసీఆర్ అభిమతం..మనం బాగుండాలి…పక్క రాష్ట్రాలు కూడా బాగుండాలనే ఉదాత్త గుణం..కేసీఆర్‌ది. ఇందులో కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనాలు ఏమి లేవు…ఎందుకంటే కేసీఆర్ తెలంగాణకే తప్ప, ఏపీలో కూడా పాగా వేయాలనే ఆలోచన లేదు. అంతిమంగా తెలుగు ప్రజల శ్రేయస్సే…కేసీఆర్ లక్ష్యం. గోదావరి జలాలను భవిష్యత్తులో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు అనుసంధానం చేయడం ఖాయం..అదే జరిగితే ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతాయనడంలో సందేహం లేదు. కేసీఆర్, జగన్‌ల సఖ్యత…తెలుగు రాష్ట్రాలకు శుభసూచకం..మనం బాగుండాలి..పక్కవాళ్లు కూడా బాగుండాలనే ఉదాత్తగుణంతో సాటి తెలుగు రాష్ట్రం మేలు కోసం కేసీఆర్ పడుతున్న తపన నిజంగా అభినందనీయం..అందుకే కేసీఆర్…తెలంగాణ సాగునీటి దౌత్యవేత్తే కాదు..అసలు సిసలైన రాజకీయ దౌత్యవేత్త కూడా..ఇందులో సందేహమే లేదు…హ్యాట్సాఫ్ కేసీఆర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat