Home / SPORTS / జమైకా నుంచి వచ్చిన ఈ యువ కెరటం..ఇప్పుడు ఒక సంచలనం..!

జమైకా నుంచి వచ్చిన ఈ యువ కెరటం..ఇప్పుడు ఒక సంచలనం..!

వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ సిక్సర్లు వీరుడు, విధ్వంసకర బాట్స్ మాన్ క్రిస్ గేల్ 1979 సెప్టెంబర్ 21న జమైకాలో జన్మించాడు. ఈ జమైకన్ ఆటగాడు ఎడమచేతి బాట్స్ మాన్ మరియు కుడి చేతి బౌలర్. తానూ క్రికెట్ లో అడుగు పెట్టింది మొదలు తన బ్యాట్టింగ్ తో ప్రతీఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన 19వ ఏట గేల్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అడుగు పెట్టాడు. అనంతరం 1999 లో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఆ తరువాత మరో ఆరు నెలలకు టెస్టుల్లో అరంగ్రేట్రం చేసాడు. 2001 జూలైలో గేల్, డారెన్ గంగాతో కలిసి జింబాబ్వే పై  తొలి వికెట్ కు 214 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ఇలా తన కెరీర్ ప్రారంభించిన గేల్ టీ20 స్పెషలిస్ట్ గా మారిపోయాడు. ఈ విధ్వంసకర ప్లేయర్ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ , టీ20 లో సెంచరీ కొట్టాడు. తన బ్యాట్టింగ్ తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

 

 

అంతేకాకుండా వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవరించాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్ ఇంటర్నేషనల్ కన్నా లీగ్ మ్యాచ్ లకే ఎక్కువ ఫేమస్ అని చెప్పొచ్చు. అంటే ఐపీఎల్, బీపీఎల్, బిగ్ బాష్ ఇలా ప్రతీ  లీగ్ కు హీరోగా నిలిచాడు. ఈ రోజుల్లో టీ20 పేరు చెబితే అందరికి ముందుగా గుర్తొచ్చే పేరు గ్రీస్ గేల్ నే. అయితే మొన్న ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ నే గేల్ కి చివరి టోర్నమెంట్ అని అందరు అనుకున్నారు. కాని స్వయంగా తానే మీడియా ముందుకు వచ్చి వరల్డ్ కప్ తరువాత ఇండియాతో జరిగే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ పై స్పష్టత ఇస్తానని స్వయంగా చెప్పడం జరిగింది. కాని ఇప్పుడు వన్డే సిరీస్ కూడా అయిపొయింది కాని ఇంకా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇక తన గణాంకాలు విషయానికి వస్తే..

 

టెస్టుల్లో: 103 మ్యాచ్ లలో 7215 పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 15 శతకాలు. 37అర్ధ శతకాలు ఉన్నాయి.

వన్డేల్లో: ఇప్పటివరకు 300లకు పై మ్యాచ్ లలో ఆడి 10800 సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 25 శతకాలు, 54 అర్ధశతకాలు ఉన్నాయి.

టీ20: 58మ్యాచ్ లలో 1627 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు మరియు 13 అర్ధశతకాలు ఉన్నాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat