Home / ANDHRAPRADESH / బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!

బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!

పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ కరకట్ట మీద ఉన్న బాబుగారి అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. బాబుగారి ఇంటి గార్డెన్, హెలిపాడ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. కరకట్ట మీద ఉన్న ప్రజలను కాపాడడం కోసం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. . ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్‌లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. దీంతో బాబుగారు తన ఇంటి మీదికి డ్రోన్ కెమెరాలను పంపిస్తున్నారంటూ రంకెలు వేశారు. ఇక డ్రోన్ల ద్వారా చంద్రబాబు భద్రత పైన కుట్ర చేసారని.. నీటి ప్రవాహం ఉద్దేశ పూర్వకంగా విడుదల చేయటం ద్వారా మొత్తం అమరావతికే నష్టం చేయాలని ప్రభుత్వం ఆలోచన అంటూ దేవినేని హాస్యాస్పద ఆరోపణలు చేశారు.

ఇక ట్విట్టర్ పిట్ట లోకేషం ఏకంగా ఈ విషయంపై ఓ ట్వీట్ పెట్టారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు తెప్పించడం కోసం…వైసీపీ నేతలు బ్యారేజీ గేట్లకు అడ్డంగా ఓ పడవ పెట్టారంటూ చినబాబు కూతెట్టాడు. ఆ పడవ సాయంతో వరదను దారి మళ్లించి చంద్రబాబు ఇంటివైపు పంపించారట. ఆ పడవ వల్లనే బాబోరి ఇల్లు వరదలో మునిగిపోయిందట. ఇది లోకేషం పెట్టిన ట్వీట్. బాబుగారి ఇంటిని వరద నీటిలో ముంచెత్తేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ లోకేష్ ట్విట్టర్‌లో రెచ్చిపోయాడు. అసలు చినబాబు, పెదబాబుకు ఓటమి దెబ్బతో మతి భ్రమించినట్లుంది..ఇద్దరూ ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అసలు ట్వీట్ పెట్టేటప్పుడు లాజిక్ ఉందా లేదా అని చూసుకోవాలి కదా…కేవలం చిన్న పడవతో వరదను ఆపి, బాబుగారి ఇంటికి దారి మళ్లించగలమా..చిన్న పడవతో వరద దారి మళ్లేంచే వీలు ఉంటే..ఇక పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు కట్టడం..హ్యాపీగా వరదకు అడ్డంగా చిన్నపడవలు పెట్టేస్తే సరే..అసలు ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని చినబాబు పడవతో వరదను బాబుగారి ఇంటికి మళ్లించారంటూ…చావు తెలివితేటలు ప్రదర్శించాడు. అసలు భారీ వరదలకు మత్స్యకారుల బోట్లు కొట్టుకొని పోయి..గేట్లు తెరిచినప్పుడు చిక్కుకుని ఉంటాయి…ఎవరో దాన్ని వీడియో తీసి లోకేష్‌కు పంపించి…ఆ బోట్లు వైసీపీ నేతల అడ్డంగా పెట్టి వరదనీటిని బాబుగారి ఇంటికి మళ్లించారని చెప్పి ఉంటారు. ఇంకే ముంది లోకేషం ఆ ఫోటోలో బోటుకు సర్కిల్ వేసి మరీ ట్విట్టర్‌లో పెట్టి మురిసిపోయాడు. మొత్తానికి తండ్రి ఒంటి చేత్తో తుఫానులు ఆపేస్తే..మామ బాలయ్య ఒంటి చేత్తో ట్రైన్‌ను వెనక్కి పంపిస్తే…లోకేషం చిన్న పడవతో వరద దారిని మళ్లించారంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఈ తండ్రీ కొడుకులు అస్సలు మారరు…ఇలా తమ మాటలతో, చేష్టలతో అడ్డంగా దొరికిపోతూనే ఉంటారు..అంతేగా మరి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat