Home / ANDHRAPRADESH / రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవద్దు..

రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవద్దు..

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) పై చెలరేగుతున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి దీనిపై సస్పెన్స్ కు తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ-కేవైసీ నమోదు చేయించుకోవడానికి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ-కేవైసీ సాకుతో రేషన్ డీలర్లు ప్రజల పేర్లను తొలగించినా, రేషన్ సరుకులు ఇవ్వక పోయినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ-కేవైసీ కోసం మహిళలు చంటి బిడ్డలతో గంటలతరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat