Home / NATIONAL / నిబద్ధత కలిగిన రాజకీయవేత్త శ్రీ అరుణ్‌ జైట్లీపై స్పెషల్ బయోగ్రఫి..!

నిబద్ధత కలిగిన రాజకీయవేత్త శ్రీ అరుణ్‌ జైట్లీపై స్పెషల్ బయోగ్రఫి..!

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఈ రాజకీయవేత్త శ్రీ అరుణ్‌ జైట్లీపై స్పెషల్ బయోగ్రఫి..!

1.అరుణ్ జైట్లీ 1952 నవంబర్ 28న ఢిల్లీలోని ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు

2.జైట్ తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది

3.జైట్లీ ఢిల్లీలో డిగ్రీ చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు

4.చిన్నతనం నుంచే జైట్లీలో న్యాయకత్వ లక్షణాలు ఉండేవి

5.ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నపుడే ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

6.అప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు
7.ఎమర్జెన్సీ సమయంలోనూ 19 నెలలు జైలుకు వెళ్లారు

8.జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ప్రస్తుత బీజేపీ) లో చేరారు

9.అప్పట్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు

10.1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు

11.అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా గల మంత్రిగా నియమించబడ్డారు

12.పలు రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసారు

13.2014 ఎన్నికల్లో మొదటిసారి అమృత్‌సర్ నుంచి ఓటమి పాలయ్యారు

14.అయినా మోడి నేతృత్వంలో ఆర్ధికమంత్రిగ సమర్ధవంతగా బాధ్యతలు నిర్వహించారు

15.జీఎస్టీ, నోట్లరద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నపుడు దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి పగడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారు జైట్లీ

16.ఆ సమయంలో ఆర్థికమంత్రిగా ఉన్నపుడే జైట్లీ మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ బారిన పడినట్టు గతంలో ప్రభుత్వాధికారులు వెల్లడించారు

17.అప్పట్లోనే ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు.

18.తిరిగి భారత్‌కు వచ్చి అదే చికిత్స కొనసాగిస్తున్న జైట్లీ కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు.

19.ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుల సలహామేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు.

20.గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు.

21.అయినా అరుణ్ జైట్లీ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో 24వ తేదీ ఆగష్టు 2019న ఆయన తుదిశ్వాస విడిచారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat