Home / SPORTS / ఆ ఆటగాడు నిలబడితే క్లైమాక్స్ అదరహో…మరోసారి అదే స్కెచ్ !

ఆ ఆటగాడు నిలబడితే క్లైమాక్స్ అదరహో…మరోసారి అదే స్కెచ్ !

మొన్న ప్రపంచకప్ ఫైనల్..నేడు యాషెస్‌, ఫార్మాట్ వేరే గాని ప్లేయర్ మాత్రం ఒక్కడే. అతడే ఇంగ్లాండ్ ఆల్‌ రౌండర్ బెన్‌ స్టోక్స్‌. ప్రపంచకప్ ఫైనల్ లో గెలవలేని మ్యాచ్ ను కూడా గెలిపించి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి అదే ఫీట్ చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా దే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కాని చివరికి అందరిని ఆశలు తలకిందులు చేసి ఇంగ్లాండ్ గెలిచేసింది. దీనంతటికి ముఖ్య కారణం మాత్రం బెన్‌ స్టోక్స్‌ నే. ఒక పరంగా చూసుకుంటే ఇంగ్లాండ్ చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఒకపక్క బెన్‌ స్టోక్స్‌, మరోపక్క జాక్‌ లీచ్‌ ఇంకా 60 పరుగులు చెయ్యాలి. ఎవరైనా ఒక్క వికెట్ నే కదా ఎంతసేపు అనుకుంటారు. కాని అక్కడ స్టోక్స్‌ ఉన్నాడని మర్చిపోయారు. అనుకున్నట్టుగానే ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాన్ని అందించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat