Home / ANDHRAPRADESH / ఛీఛీ…ఇంత దిగజారుడు ప్రచారమా…ఎల్లో బ్యాచ్ మారదా..!

ఛీఛీ…ఇంత దిగజారుడు ప్రచారమా…ఎల్లో బ్యాచ్ మారదా..!

 నారా వారి పుత్రరత్నం లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేయిస్తూ రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం జగన్‌‌ను, వైసీపీ మంత్రులను తిట్టించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించి, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు లోకేష్ సోషల్ మీడియా టీమ్ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. ఇటీవల వరదల నేపథ్యంలో శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో అసభ్యపదజాలంతో దూషించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియోపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు శేఖర్ చౌదరితో పాటు, మరో నలుగురు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో.. లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీడీపీ సోషల్ మీడియా టీమ్, కొందరు సినీ దర్శకుల దగ్గర డబ్బులు తీసుకుని ఈ వీడియోలు చేశామని, మాలాగే వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చాలా టీమ్‌లు పని చేస్తున్నాయంటూ అరెస్ట్ అయిన శేఖర్‌ చౌదరితో పాటు, మరో నలుగురు అంగీకరించారు. దీంతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలో లోకేష్ ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తాజాగా టీడీపీ సోషల్ మీడియా టీమ్ మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కైంది. ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ పరువు తీసేందుకు ప్లాన్ చేశారు. వైయస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పేరుతో ఓ ఫ్లెక్సీ తయారు చేయించి..అందులో టెన్నిస్ విభాగం అంటూ.. సానియా మీర్జా ఫోటో పెట్టి, పీటీ ఉష పేరు పెట్టారు. ఆ ప్లెక్సీని రాజధానిలో రోడ్డు పక్కన ఏర్పాటు చేయించి, ఫోటో తీసి సోషల్ మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడే ఎల్లో బ్యాచ్ అడ్డంగా దొరికిపోయింది.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కింద బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 5 లక్షలు, రజతం సాధించిన వారికి రూ. 4 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ. 3 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులను గుర్తించాలని, ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించిన వారికి రూ. 1.25 లక్షలు, రజతం వచ్చిన వారికి రూ. 75 వేలు, కాంస్యం వచ్చిన వారికి రూ. 50 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఏ సానియామీర్జాకో, పీటీ ఉషకో ప్రకటించలేదు. అసలు సానియామీర్జా ఈ మధ‌్య టెన్నిస్‌ ఆడడం లేదు..పీవీ సింధూ బాడ్మింటన్‌లో వరల్డ్ బాడ్మింటన్ చాంఫియన్ షిప్ టైటిల్ గెల్చుకుంది. ఒక వేళ సింధూ ఫోటో పెట్టి, బాడ్మింటన్ పెట్టినా అతికినట్లే ఉండేది..కానీ సానియా మీర్జా ఫోటో పెట్టి కావాలని పీటీ ఉష పేరు పెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నా ఎల్లోబ్యాచ్ పన్నాగం పారలేదు. అయినా ప్రభుత్వ ప్రకటనలు అంటే పెద్ద హోర్డింగులు, భారీ ఫ్లెక్సీలు నగరంలోని ప్రధాన రహదారుల్లో పెడతారు. ఇలా రోడ్డు పక్కన కాదు..దీంతో నెట్‌జన్లు ఎల్లో బ్యాచ్‌పై ఫుల్లుగా సెటైర్లు వేశారు.. ఈసారి కొత్తగా ట్రై చెయ్యండి….లోకేశం.. మీరు మరీ ఇంత దారుణమైన దుష్ప్రచారాలకు దిగజారుతారని అనుకోలేదు. మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తోంది. అసలు ప్రభుత్వ ప్రకటనలు అంటే పెద్దపెద్ద హోర్డింగులు పెడతారు..ఇలా రోడ్డు పక్కన ఇలా కరెంటు స్తంభాలకు, బడ్డీ కొట్లపైన ఉండవు అనే చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..ఈ సారి కొత్త ట్రై చేయండి తమ్ముళ్లు అంటూ నెట్‌జన్లు ఎల్లో బ్యాచ్‌పై సెటైర్లు వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat