దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ముదరటంతో ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.
