Home / festival / వినాయకుడు గజముఖంతో కూడా మనిషి ముఖంతో కనిపించే దేవాలయం ఎక్కడో ఉందో తెలుసా…?

వినాయకుడు గజముఖంతో కూడా మనిషి ముఖంతో కనిపించే దేవాలయం ఎక్కడో ఉందో తెలుసా…?

దేవాయాలకు పుట్టినిల్లు మన వేద భూమి. హిందూ ధర్మం విలసిల్లుతున్న మన భరతదేశంలో అనేక మంది దేవతలను పూజిస్తారు. పురాణాలు, ఇతిహాసాలకు ఆనవాళ్లు మన కర్మభూమిలో ఇప్పటికీ కనిపిస్తాయి.శివాలయాలు, రామాలయాలు, శ్రీ కృష‌్ణ దేవాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, గణేష ఆలయాలు, అమ్మవార్ల ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయాలకు పెట్టినిల్లుగా దక్షిణ భారతదేశం విలసిల్లుతోంది. ఇక దేశమంతటా ఉన్న గణేష ఆలయాల కంటే తమిళనాడులోని ఓ వినాయక ఆలయం విభిన్నంగా ఉంటుంది. సహజంగా గణనాథుని ఆలయాల్లో వినాయకుడు గజముఖంతో కొలువై ఉంటాడు. కాని తమిళనాడులోని తిలత్తార్‌పానాపూరిలో ఉన్న ఆదివినాయక మందిరంలో మాత్రం గణేషుడు గజముఖంతో కాకుండా మనుష్య రూపంలో ఉంటాడు. ఇక్కడ గణపతికి ఏనుగు వలే తొండం, దంతాలు కాకుండా మనుషి వలె ముఖం ఉంటుంది. అందువల్లే దేశంలో ఉన్న అన్ని గణేష్ దేవాలయాలకంటే తమిళనాడులోని ఈ ఆదివినాయక మందిరం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వినాయకుడికి మరో విశిష్టత ఉంది. గత జన్మలో చేసిన పాపాలను ఈ ఆది వినాయకుడు పోగొడతాడని భక్తుల నమ్మకం.

హిందూ సంప్రదాయం ప్రకారం సాధారణంగా పిండ ప్రదానాలు నదీతీరాలలో, సముద్ర ప్రాంతాలలో చేస్తారు. కాని దేశంలోనే ఆలయంలో పిండ ప్రదానం చేసే సంప్రదాయం ఒక్క ఈ ఆది వినాయక మందిరంలో తప్పా మరెక్కడా లేదు. ఈ ఆలయంలో స్వయంగా శ్రీ రామచంద్రుడు దశరథుడికి పిండ ప్రదానం చేసాడని ఓ పురాణ గాథ తెలుపుతోంది. తన పూర్వజన్మలో చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఇక్కడి గణపతికి ప్రత్యేక పూజలు చేశాడని ప్రతీతి. శ్రీరాముడు తన తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న సమయంలో బియ్యపు పిండితో చేసిన పిండాలు కీటకాలుగా మారిపోతుండేవి. ఇలా శ్రీరాముడు ఎన్ని సార్లు బియ్యపు పిండితో పిండాలు చేసినా అవి కీటకాలుగానే మారిపోతూ ఉండేవట. దీంతో ఏం చేయాలో తెలియని శ్రీరాముడు పరమశివుడిని ప్రార్థిస్తాడట. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి గత జన్మలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ పరిస్థితి ఎదురైందని, ఈ సమస్య పరిష్కారం కోసం ఈ ఆది వినాయక మందిరంలో పూజలు చేయాలని శ్రీ రాముడికి చెబుతాడట. అలా పరమేశ్వరుడి సూచనమేరకు శ్రీరామచంద్రుడు ఈ ఆది వినాయక మందిరంలో పూజలు చేసి ఇక్కడే పిండ ప్రదానం చేస్తాడట. అయితే శ్రీరాముడి పూజలన్నీ ముగిసిన తర్వాత ఆ నాలుగు పిండాలు నాలుగు శివలింగాలుగా మారిపోయాయని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.

ప్రస్తుతం ఆ నాలుగు శివలింగాలను ఈ ఆలయంలోని ముక్తేశ్వర మందిరంలో చూడవచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో మనుష్య రూపంలో ఉన్న గణేషుడితో పాటు శివుడిని కూడా పూజిస్తారు. ఇక ఈ దేవాలయానికి దగ్గర్లో సరస్వతీ దేవి దేవాలయం కూడా ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ప్రతి ఏడాది సంకష్ట చతుర్థసి రోజున అగస్త్య మహాముని ఇక్కడ మనుష్య రూపంలో ఉన్న వినాయకుడిని పూజించడానికి వస్తాడు. ఈ ఆది వినాయక ఆలయలో గణపతిని పూజించడం వల్ల మన:శాంతి దొరుకుతుందని భక్తుల నమ్మకం. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ ఆదివినాయక ఆలయానికి అన్ని రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుచినాపళ్లి లేదా మధురై ఎయిర్ పోర్టు నుంచి ఈ ఆది వినాయక ఆలయానికి చేరుకోవచ్చు. తిరువరూర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరగా ఉంటుంది. ఇక చెన్నై నుంచి ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. చూశారుగా దేశంలో ఎక్కడా లేని విధంగా గజముఖంతో కాకుండా మనుష్య ముఖంతో ఉన్నఈ ఆది వినాయకుడిని దర్శించండి..గత జన్మ పాపాలను తొలగించుకోండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat