Home / UPDATES / ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. డెంగీ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది..!

ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. డెంగీ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది..!

ప్రస్తుత వర్షాకాలంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రులన్నీ డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరంలో ప్రమాదకర లక్షణం ప్లేట్‌లెట్స్ పడిపోవడం..రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ప్లేట్‌లెట్ల సంఖ్య 50 నుంచి 60 వేలు ఉన్నా…ఐసీయూలకు తరలించి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి డెంగీ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలు డెంగీ వ్యాధి నియంత్రణ..మన ఇంట్లోనే ఉంది. ఓ పక్క డాక్టర్ సలహాలు తీసుకుంటూనే..ఇంటి దగ్గర కొన్ని ఆహార పదార్థాలు. జ్యూస్‌లు తీసుకుంటే..డెంగీ జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు.

డెంగీ జ్వరం వస్తే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, జ్యూస్‌లు..

 – బొప్పాయి రసం

– కొత్తిమీర ఆకులతో జ్యూస్

– విటమిన్ సీ కలిగిన ఆరెంజ్, టమాటాలు, స్ట్రాబెర్రీలు, మొలకలు, ఎర్ర మిరియాలు

– ఆకు కూరలు

– రోజుకు 8 నుంచి 10 గ్లాసుల కాచివడబోసిన నీరు

– ప్రోటీన్ ఫుడ్

– అరటి పండ్లు

– కొబ్బరి నీరు

– నల్ల ద్రాక్ష జ్యూస్

– మార్కెట్లో దొరికే చ్యవాన్ ప్రాష్ 1

– దానిమ్మ జ్యూస్

– వేప జ్యూస్

– బాసిల్ విభూది తులసి ఆకులు

– కాస్సియా రూట్స్

– మెంతి ఆకు

– గ్రీన్ టీ

– బార్లీ గడ్డి

– గోల్డెన్ సీల్

– హెర్మాల్ విత్తనాలు

– . డెవిల్స్ ట్రీ

-కకమచి సిరప్

-. ఉసిరి

– తులసి టీ

డెంగీ జ్వరం వస్తే ఈ ఆహారపదార్థాలను. జ్యూస్‌లను తీసుకోండి…ఒకేసారి మొత్తం అన్నీ తీసుకోకపోయినా…కొన్ని పదార్థాలు తీసుకున్నా…డెంగీ జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు. అయితే ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం మాత్రం కచ్చితంగా తాగాల్సిందే. డాక్టర్లు కూడా బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండ్లు తినాలని చెబుతారు. డెంగీ వస్తే ఆసుపత్రులలో జాయిన్ అయి వేలకు వేలు వదిలించుకోవడం కంటే…ఒక పక్క డాక్టర్ సలహాతో మందులు వాడుతూనే…ఈ ఆహార పదార్థాలను, జ్యూస్‌లను తీసుకోండి. త్వరగా డెంగీ జ్వరం నుంచి బయటపడతారు. ఒకవేళ ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు తగ్గితే మాత్రం కచ్చితంగా ఆసుపత్రిలో జాయిన్ కావాల్సిందే. ప్లేట్‌లెట్ల సంఖ్య ప్రమాదకరంగా లేకుంటే మాత్రం పైన చెప్పిన ఆహార పదార్థాలు, జ్యూస్‌లతో వేగంగా కోలుకుంటారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat