Home / ANDHRAPRADESH / ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు

ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు

తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, ఆపార్టీ జన సైనికులకు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు..

1.నాకు కులం, మతం లేదంటావు.. నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..?

2.తెలంగాణకు వెళ్ళి నేనిక్కడ వుంటే ఆంధ్రావాళ్ళని ఉచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్రాలో వుండి తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారంటావ్.. దీనికి నీ సమాధానం ఏమిటి ?
3. నెల్లూరులో ఆంధ్రవాళ్ళని కొడుతున్నారంటావ్ కాదా అసలు నెల్లూరు ఎక్కడ వుంది అని ఆలోచించావా.?

4. రాష్ట్ర విభజన అన్యాయంగా చేసారు.. 11 రోజులు అన్నం మానేసా అని ఆంధ్రాలో అంటావ్.. తెలంగాణా వెళ్ళి ఆంధ్రవాళ్ళు తెలంగాణాని దోచుకుతిన్నారంటావ్.. ప్రాంతల మధ్య చిచ్చు రేపేదెవరు సమాధానం చెప్పు.?

5. 2014 లో ప్రశ్నించడానికి పార్టీ పెట్టావ్ కాదా చంద్రబాబుని ఏ రోజైనా ప్రశ్నించావా ?

6.రాజధాని పేరుతో ఎంత భూదోపిడి జరిగిందో నీకు తెలియదా ఒక్క రోజైనా ప్రశ్నించావా ?

7 . నాలుగు సంవత్సరాలు కలిసి వున్నావ్ కాదా TDP తో ఒక్కో MLA ఎంత అవినీతి చేసారో నీకు తెలీదా.?

8.ఇసుక దోపిడీ ,భు కుంభకోణం, కాల్మనీ, సెక్స్ రాకెట్ , వీటి గురించి ఏ రోజైనా ప్రశ్నించావా.? అవి నీకు కనబడలేదా.?

9 .MLA చింతమనేని ప్రభాకర్ లేడీ MRO నీ ఇసుక లో వేసి కొట్టినపుడు అప్పుడే ఎందుకు మాట్లాడలేదు(తర్వాత మాట్లాడావ్).?

10. ర్యాగింగ్ పేరుతో రిషితేశ్వరి చనిపొతే ఎందుకు నోరు మెదపలేదు.?

11.23 MLA లని అడ్దగోలుగా కొని రాజ్యాంగన్ని అపాహస్యం చేస్తుంటే ఏరోజైనా అడిగావా.?

12.జాతీయోద్యమా నాయకుల పేర్లు చెప్పి నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అంటావ్ కాదా రాజ్యాంగన్ని అపాహస్యం చేస్తుంటే ప్రశ్నించాడానికి నోరు రాలేదా ?

13.నారాయణ కాలేజీ స్టూడెంట్స్ అంతమంది చనిపొతే ఎందుకు ప్రశ్నించలేదు

14 సత్తెనపల్లిలో కొడెల కుమారుడు, కుమార్తె అరాచకాలు నీకు కనబడలేదా.?

15. ఎన్నికల ముందు రాజధానికి వెళ్ళి రాజధాని ప్రాంతం ఒక కులానికి సంభందించినదే అంటావ్ మరి ఎన్నికల టైమ్ లో కర్నూలులో నేను అధికారంలోకి వచ్చాక కర్నూలే రాజధాని అంటావ్ ఏమాట నమ్మాలి?
16. 5 సంవత్సరాలు జగన్ ని ప్రతిపక్షంలో వున్నవారిని ప్రశ్నించావ్ కదా అధికారంలో వున్న చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించాలని అనిపించలేదా ?

17. అలాంటి నువ్వు ఎందుకు జగన్ వచ్చి 3నెలలు కూడా అవకుండానే విమర్శలు చేస్తున్నావ్.?

18. కొడెల అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం చేస్తే ఎందుకు అడగలేదు.?

19. evm లు అంటున్నావ్ గా మరి 2014లో అవే EVMలు కాదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు.?

20. EVM వల్ల జగన్ గెలిచారంటున్నావు.. మరి నీ ఏకైక రాపాక దేంతో గెలిచాడు.? పోనీ ఈవీఎంలు ట్యాంసరింగ్ జరిగితే బ్యాలెట్ ఓట్లలో వైసీపీకి అత్యధిక మెజారిటీ ఎలా వచ్చింది?

పవన్ కళ్యాణ్ లేదా ఆయన అభిమానులు దీనిలో ఒక్కదానికైనా సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం ఇప్పటి నుంచి అయినా విలువైన రాజకీయాలు చెయ్యాలని, నెక్ట్స్ టైమ్ కనీసం ఎమ్మెల్యే అయినా అవ్వాలని కోరుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat