Home / 18+ / సింధూ మీరు మాట్లాడింది తప్పు.. అంటూ ట్రోల్ చేస్తున్న సమంత ఫ్యాన్స్.. అసలేం జరిగింది.?

సింధూ మీరు మాట్లాడింది తప్పు.. అంటూ ట్రోల్ చేస్తున్న సమంత ఫ్యాన్స్.. అసలేం జరిగింది.?

తాజాగా ఓ వివాదంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇరుక్కున్నారు. సింధు జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నారని, అందులో సమంత నటించనుందనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో స్పెయిన్‌ వెకేషన్ కు వెళ్లిన సమంత తిరిగి భారత్ వచ్చాక ’96’ సినిమా రీమేక్‌లో నటిస్తారట.. అయితే 96 తర్వాత ప్రముఖనటుడు సోనూసూద్ తీస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో సమంత నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే తన జీవితం ఆధారంగా తీయబోతున్న సినిమాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె నటిస్తే బాగుంటుందని సింధు కామెంట్స్ చేసింది. దీనినిబట్టి తన పాత్రలో సమంత చేయడం తనకు ఇష్టంలేదని చెప్పినట్టయింది.

వాస్తవానికి సమంత పేరు పెద్దఎత్తున ప్రచారం జరిగింది.. అందరూ ఓకే అనుకుంటున్న టైంలో సింధు ఇలా మాట్లాడడం సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీపాత్ర చేయడానికి ఎవరు సరిపోతారని విలేఖరులు అడగగా దీపికా పదుకొణె నటిస్తే బాగుంటుంది.. కారణం ఆమె బ్యాడ్మింటన్‌ బాగా ఆడతారు, గొప్పనటి కూడా.. అన్నారు. అలాగే నిర్మాతల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. దీపికా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ వరకూ బాగానే ఉన్నా ఆమె మంచినటి అంటే సమంత తన పాత్ర బాగా చేయలేదనే ఉద్దేశంతో సింధు ఉందనిపిస్తోంది. ఈ విషయంపైనే సింధుపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. నీపాత్ర చేయాలంటే బ్యాడ్మింటన్ రావాలనే రూల్ లేదు కదా.. ఓ కిల్లర్ రోల్ చేయాలంటే హీరో హంతకుడు అయి ఉండనవసరం లేదు సింధు అంటూ సమంత ఫ్యాన్స్ సింధును ట్రోల్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat